Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైడ్ గ్యాస్ మార్కెట్ అజెండా. నీటిని ఇంధనంగా ఉపయోగిస్తుంది కాబట్టి దీని వల్లన ఎలాంటి కాలుష్యమూ ఉండదు. అంతే కాదు ఇక్కడ గ్యాస్ నిల్వ ఉండే అవకాశం లేదు. కాబట్టి రక్షణ విషయంలో ఆందోళన అవసరం లేదు. సురక్షితంగా వంట చెయ్యొచ్చు అని గర్వంగా చెప్పుకుంటారు.
ఇప్పటికి నూటికి 95 మంది గ్రామీణ పేదలు వంట గ్యాస్ కొనే స్థితిలో లేరని కేంద్ర ప్రభుత్వమే చెబుతుంది. అలాంటి కష్టాలను చూసి దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం కనిపెట్టాలన్న ఆలోచనతో కేరళకు చెందిన విమల్ గోపాల్, విజీష్ టి.వి, నితిన్ మోహన్, ప్రవీణ్ శ్రీధర్, రిష్విన్ అనే ఐదుగురు యువకులు చేసిన అద్భుతమైన ఆవిష్కరణే 'హైడ్ గ్యాస్' పొయ్యి
హైడ్గ్యాస్.. విద్యుచ్ఛక్తి 'సాయంతో నీటిని ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. గ్యాస్‌ని దానికదే ఉత్పత్తి చేసుకునేలా ఈ ప్రత్యేకమైన పొయ్యిని రూపొందించారు. ఈ పొయ్యిని కుక్ టాప్ అంటారు. ఈ పొయ్యి ఇంట్లో ఉంటే మనకు గ్యాస్ సిలిండర్లతో పనే ఉండదు. కట్టెల అవసరం లేకుండానే ఈ స్టౌవ్ వాడుకోవచ్చు. నీటిని అందిస్తే అది ఆక్సిజన్, హైడ్రోజన్‌గా మార్చి ఇంధ నాన్ని ఉత్పత్తి చేస్తుంది. దానిపై మనం చక్కగా వంట చేసుకోవచ్చు. దీంతో గ్యాస్ నిల్వ ఉంచాల్సిన పనిలేదు. గ్యాస్ బండలతో అసలు పనేలేదు. సాధారణ గ్యాస్‌తో పోలిస్తే ఇది చాలా సేఫ్. సోలార్ పవర్ కూడా అనుసంధానిస్తున్నట్లు రూపకర్తలు ప్రకటించారు. నీటితో వంట గ్యాస్ అంకుర సంస్థ అంకుర సంస్థను 2014లో ఈ ఐదుగురు మిత్రులు ప్రారం భించారు. డిగ్రీ రెండో ఏడాదిలో వెబ్సైట్లు ఆండ్రాయిడ్ యాప్‌లు చేయాలని ఆలోచనలతో ఉండేవారు. కానీ వారి చదువు పూర్తయ్యే సమయానికి అవేమి కాకుండా సరికొత్తగా ఆలోచించారు. నేడు వాళ్ళు ప్రపంచం ముందు ఒక అద్భుతాన్ని చేసి చూపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వాటి ఆవశ్యకత చాలానే ఉంది. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువు తున్నప్పుడు తమ డిజిటల్ థింకింగ్‌తో హైడ్గ్యాస్గా అసం తప్తికి లోనై ఏదో చేయాలనుకున్నారు. కానీ ఏం చేయాలనే దానిపై క్లారిటీ రాలేదు. ఇంటర్ కాలేజ్ కార్ రేస్‌లో పాల్గొనడానికి వచ్చిన టీం అంతా కలిశారు. ప్రతి టీం తయారు చేసిన తమ తమ కార్లతో ప్రఖ్యాత బుద్ధ సర్క్యూట్ దగ్గర జరిగే రేస్‌లో పాల్గొనాలి. తమ కారు కోసం మంచి బ్యాటరీని తయారు చేసే క్రమంలో హైడ్రోజన్ సెల్‌తో ప్రయోగం చేశారు. ఈ యువకులు దానితో ఈ పునరుత్పాదక శక్తిపై ప్రయోగాలు మొదలు పెట్టారు. ఈ ప్రయో గమే సఫలీకతం అయి అందుబాటులోకి వచ్చింది. ''దేశంలో పెద్ద కంపెనీల చేతిలో గ్యాస్ పంపిణీ కేంద్రీకతం కావడం మాకు నచ్చలేదు. సాధ్యమైనంతలో దీన్ని వికేంద్రీక రిద్దామనే సంకల్పించాం'' అంటున్నారు ఈ
ఆవిష్కర్తలు..
ఉచితమే కాదు సురక్షితం
కుళాయి నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా మార్చేస్తుంది ఇది. ఇండ్లతో పాటు హోటళ్లలో చాలా ఉపయుక్తం కానుంది. ఎల్పీజీతో పోలిస్తే ఇది చాలా చవగ్గా దొరకడమే కాదు. మరెంతో సురక్షితం కూడా అనేది ఈ కుర్రాళ్ళ మాట. అవకాశాలన్నింటిని పూర్తిగా ఎలా వినియోగించుకోవచ్చో అని చెప్పడానికి ఓ చక్కటి ఉదాహరణగా హైడ్ గ్యాస్ ఆవిష్కరణను అభివర్ణించవచ్చు. ప్రమాదం
జరగడానికి అవకాశమే లేదు. ఇదే హైడ్ గ్యాస్ మార్కెట్ అజెండా. నీటిని ఇంధనంగా ఉపయోగిస్తుంది కాబట్టి దీని వల్లన ఎలాంటి కాలు కూడా ఉండదు. అంతే కాదు ఇక్కడ గ్యాస్ నిల్వ ఉండే అవకాశం లేదు. కాబట్టి రక్షణ విషయంలో ఆందోళన కూడా లేదు. ఉచితమే సురక్షితంగా వంట చెయ్యొచ్చు అని గర్వంగా చెప్పుకుంటారు.
రెండు రకాల కస్టమర్లను టార్గెట్ చేసుకుని ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో మొదటిది రెస్టారెంట్, హౌటళ్లు వీరికి ఎంత కాదన్నా రోజుకి 3 నుండి 4 సిలిండర్ల వాడకం ఉంటుంది. ఈ వినియోగంతో పోలిస్తే దీనికి ప్రత్యామ్నాయంగా హైడ్ గ్యాస్ ఎంతో లాభదాయకం అవుతుందని భావించారు. రెండో టార్గెట్ గహ వినియోగదారులు. ఈ మార్కెట్ చాలా పెద్దది కాబట్టి ముందుగా హౌటల్స్, ప్రొడక్టును సేల్ చేస్తున్నారు. హౌం వర్షన్ ప్రొడక్ట్ పరిశోధన అభివద్ధి కొనసాగుతోంది.
అంతా బాగానే ఉంది కానీ ఈ అంకుర సంస్థ నడవాలంటే ముందు దీనికి ఇంధనం కావాలిగా అందుకు మొదటి రెండు నెలలు రియినో ల్యాబ్స్ సొంత నిధులతోనే నెట్టుకొచ్చింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖతో పాటు స్టార్టప్ విలేజీ నుంచి ప్రారంభ నిధుల సమీకరించారు. మరిన్ని నిధులను సేకరించే పనిలో వున్నారు.
- అనంతోజ్ మోహన్ కష్ణ , 8897765417