Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విదేశాలలో జరిగే సెమినార్లు, ఉపన్యాసాలు, శిక్షణలని ఏడాదికి 200 రోజులు విమానాలలోనే తిరుగుతుంటాడు. లక్ష్మసాధన కోసం నిరంతరం కష్టపడి విజయాన్ని సాధిస్తాడు. ఒకదానితో ఒకటి పొంతన లేని 56 భాషలను ఆకట్టుకొనే విధంగా మాట్లాడటం అతని నైజం. ఇంగ్లీషు, పోర్చుగీసు, జపనీస్, జార్జియన్, కిన్యర్వాండా (రువాండా అధికారిక భాష), క్యూచ్యూ (దక్షిణ అమెరికా మధ్య ఉండే ప్రజలు మాట్లాడే భాష) లాంటి విదేశీ భాషలు ఎన్నో నేర్చుకున్నాడు. రోమేనియన్ భాష నిజమైన రొమేనియన్ల కంటే. బాగా మాట్లాడగలడు. డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయం కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్నేహితులను తయారు చేసుకోవడం ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవచ్చనేది అతని ఉద్దేశం. గొప్ప గొప్ప భాషా శాస్త్రవేత్తలు సైతం 50 భాషలు మించి మాట్లాడటం అసాధ్యమనే విషయాన్ని అంగీకరిస్తారు.
రానున్న కొత్త సంవత్సరంలో ఓ కొత్త భాష నేర్చేయాలని న్యూ ఇయర్ రెజల్యూషన్ తీసుకున్నారా..! ఆల్ ది బెస్ట్ ఆ విషయంలో మీకు కాస్త ప్రేరణనిచ్చేందుకు మీకో బహుభాషా కోవిదుణ్ని, పదుల భాషల మాటగాణ్ని పరిచయం చేసేస్తున్నాం. అతడికి మాట్లాడటమే జీవితం... మీకు అంతో కొంతో కొత్త మాటలు వ్యాపకం. అందుకే ఇతడి మాట వినుకోండి. 5 ఏళ్ల చిరుప్రాయంలోనే పరభాషను నేర్చుకుని నేడు 56 భాషలను మాట్లాడుతూ. 70 భాషలను అర్థం చేసుకుంటున్నాడు 32 ఏళ్ల మొహమ్మద్ మెసిక్. రికార్డుల మాట పక్కన పెడితే తానో గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు.. కాలక్రమేణ కనుమరు గవుతున్న భాషలకు ప్రాణం పోయాలని.
చిన్నతనంలో యుగోస్లేవియా
పారిశ్రామిక నగరమైన టుక్లాలో పెరిగాడు మొహమ్మద్. పలకా బలపం పట్టాల్సిన వయస్సులోనే పరభాషలో తల్లిదండ్రులతో మాట్లాడి తనలోని అసాధారణ ప్రతిభతో షాకినిచ్చాడు. ఈ షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఒకసారి తన కుటుంబంతో సెలవులకు గ్రీస్ పర్యటనకు వెళ్లారు. అక్కడ పొరుగువారు మాట్లాడు కుంటుంటే తీక్షణంగా వారి మాటలను వింటూ హావభావాలను గమనిస్తూనే గ్రీకు భాషను నేర్చుకున్నాడు. పర్యటన అయిపోయి తిరుగు ప్రయాణంలో అనుకోకుండా కారు చెడిపోయింది. రిపేరుకు లోకల్ మెకానిక్ దగ్గరికి వెళ్లి సమస్యను ఎలా చెప్పాలో అర్థంకా ని పరిస్థితిలో మొహమ్మద్ తండ్రి ఉండగా, అదే సమయంలో మెకానిక్ గ్రీకుభాషలో తన కొడుకు మాట్లాడటం చూసి తల్లిదండ్రులు ఒక్క క్షణం నిర్ఘాంతపోయారు. అప్పుడు మొహమ్మద్ వయస్సు 5 సంవత్సరాలు. బోస్నియాలో అంతర్యుద్ధం జరిగే సమయానికి మొహమ్మద్ వయస్సు 9 సంవత్సరాలు. ఆ సమ యంలో స్వీడిష్ సైనికులు అక్కడే స్థావరాలు ఏర్పా టు చేసుకోవడంతో వారితో పరిచయం పెంచుకుని స్వీడిష్ భాషను సొంతం నేర్చేసుకున్నాడు. యుద్ధా నంతరం వారితో బాటు హంగేరీ పర్యటనకు వెళ్లి. హంగేరియన్ల భాషను రుచి చూశాడు. ఆ సమ యంలో వాళ అనుము హంగేరీ బాప మనకు అన
అలా ఎలా అనేస్తాడు
ఒకేసారి పలు భాషల్లో వాగేస్తూ అదేదో ఏలియన్లానో, సైబోర్గాగో మొహమ్మద్ కనిపించే సరికి కొంతకాలానికి తమ కొడుకులో ఉన్న అసాధారణ ప్రతిభ గురించి పట్టిం చుకోక తప్పలేదు. తల్లి దండ్రులకు పిల్లవాడిలో ఇంత తెలివి తేటలు ప ఎలా వచ్చాయనే విష యంపై డాక్టరును కలి శారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి అతనికి ఆటిజమ్ ఉందని నిర్ధారించారు. దీని ప్రభావం వల్లనే చిన్న వయస్సులోనే ఎటువంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా సులువుగా విదేశీ భాషలను నేరుకోగలుగుతున్నాడని చెప్పారు. ఒకసారి తన
కార్యక్రమంలో హిబ్రూలో మాట్లాడుతుంటే వింటూ హిబ్రూ భాషపై పట్టు సాధించాడు. జుడాయిజంలోని మూడు భాషలైన లాటినో, ష్, హిబ్రూ భాషలను కేవలం ఆన్లైన్ ద్వారానే ఒకేసారి నేర్చుకున్నాడు. హిబ్రూ అనేది పాలస్తీనా, ఇజ్రాయెల్క ముఖ్యమైన భాష. ఆ సమయంలో యూరోవిజన్ పాటల పోటీ కొన్ని సంవత్సరాలు జరిగింది. ఇజ్రాయెల్ పాటలను రోజంతా వింటూ పాడుకుంటూ ఉండేవాడు. సహజంగా 32 ఏళ్లు అనగానే బాధ్యతలలో నిమగమవుతుంటారు. అదే వయస్సులో మొహమ్మద్ విదేశీ భాషలను సులభంగా నేర్చుకునే అద్భుత సామర్ధ్యమున్నా పట్టుదలగా అధ్యయనం చేస్తూ సాధన చేసేవాడు.
విదేశాలలో జరిగే సెమినార్లు, ఉపన్యాసాలు, శిక్షణలని ఏడాదికి 200 రోజులు విమానాలలోనే తిరుగుతుంటాడు. లక్ష్మసాధన కోసం నిరంతరం కష్టపడి విజయాన్ని సాధిస్తాడు. ఒకదానితో ఒకటి పొంతన లేని 56 భాషలను ఆకట్టుకొనే విధంగా మాట్లాడటం అతని నైజం. ఇంగ్లీషు, పోర్చుగీసు, జపనీస్, జార్జియన్, కిన్యర్వాండా (రువాండా అధికారిక భాష), క్యూచ్యూ (దక్షిణ అమెరికా మధ్య ఉండే ప్రజలు మాట్లాడే భాష) లాంటి విదేశీ భాషలు ఎన్నో నేర్చుకున్నాడు. రోమేనియన్ భాష నిజమైన రొమేనియన్ల కంటే. బాగా మాట్లాడగలడు. డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయం కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్నేహితులను తయారు చేసుకోవడం ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవచ్చనేది అతని ఉద్దేశం. గొప్ప గొప్ప భాషా శాస్త్రవేత్తలు సైతం 50 భాషలు మించి మాట్లాడటం అసాధ్యమనే విషయాన్ని అంగీకరిస్తారు. మాతజాసతో కలిపి 8 భాషలు మాట్లాడే వ్యక్తులు ఉంటారు. అవలీలగా 56 భాషలు మాట్లాడగల ఏకైక వ్యక్తి మొహమ్మద్.
- జోష్ డెస్క్