Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరిత్ర సృష్టించినా చరిత్ర మరవదు!
అధునాతనను.. సనాతనను.. సవాలు చేస్తుంది!
మంచిని- మానవతను స్వేచ్ఛా సమానతల్ని పలువురిస్తుం!
నింగి నేలా నీరు నిప్పు గాలుల్ని నిత్యం శ్వాసిస్తుంది!
కష్ట జీవికి ఇరువైపులే కాదు... ముందు వెనక నడుస్తుంది
తాళపత్రాల నుండి పెన్ డ్రైవుల దాకా కాలాన్ని డ్రైవ్ చేస్తుంది.
యుగాన్ని - జగాన్ని నడిపేది కాలం కాదు '' కలం'' అంటుంది!
ధీóక్కార-ఆత్మవిశ్వాసాలు నా ఆలంబన అంది!
కులం తెలియని నా కలం... మతాన్ని పెత్తనాన్ని ద్వేషిస్తుంది!
లోకకళ్యాణం! విశ్వశ్రేయస్సే! తన తపస్సంటుంది!!
పేదల వేదనలే తన నిత్యానుష్టానాలంటుంది!!
అందుకే నా కలం అంటే నాకెంతో ఇష్టం!!
దేశ జెండాలా నిత్యం నా గుండెజేబుపై రెపరెపలాడుతుంది!!
- తంగిరాల చక్రవర్తి
9393804472