Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంగీతమంటే అతనికి ప్రాణం. చిన్నప్పటి నుంచి స్వరాలతో కాలక్షేపం చేస్తూ పెరిగాడు. పాటతో పాటే నేను అంటూ సరిగమలతో సహవాసం చేస్తూ, పదనిసలతో పరుగులు తీస్తూ అతని ప్రయాణం కొనసాగుతోంది. మ్యుజిక్ టీచర్ గా సంగీతపాఠాలు చెబుతూనే మ్యూజిక్ డైరెక్టర్ గా 150 కి పైగా లఘు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన ప్రతిభ అతనిది. గుండెల్ని హాయిగా తడిమే బాణీలెన్నో అతని సంగీతఝరిలోంచి పుట్టాయి. అవి ప్రముఖుల ప్రశంసల్ని పొందాయి. నడకే సంగీతం నా బ్రతుకే సంగీతం అంటూ సాగే ఈ యువసంగీత దర్శకుడు గిటారిస్ట్ గా కూడా తన ప్రత్యేకతను చాటాడు. తన అసాధారణ సంగీత ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్న సంగీత పాటసారి, పాటల బాటసారియైన పి.వి.ఆర్.రాజాతో ఈ వారం జోష్...
అందరి బాల్యంలా అతని బాల్యంలో ఆటలు లేవు. పాటలు మాత్రమే ఉన్నాయి. పాటలే అతని ప్రపంచం. అలా అని సంగీత నేపథ్యం కుటుంబమాంటే అది కాదు. పైగా సంగీతం వద్దు ఏం వద్దు బుద్ధిగా చదువుకో అని చెప్పే తల్లిదండ్రులు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా తరచూ మందలింపులే తప్ప ప్రోత్సహమే లేదు. వారి భయం వారిది మరి. అయినా చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి బలంగా ఉంది. అందుకే అతనికి ఒంటరి తనం అలావాటైంది. అదే కవిత్వానికి, పాటలకు పురుడుపోసింది. వాటికి అతడే స్వరాలు కట్టేవాడు. అలా వచ్చి రాని ప్రయోగాలతో తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకు సాగాడు. అతని ప్రయాణంలో ఎన్నో హర్డిల్స్ దాటుకొని 'మ్యాస్ట్రో'గా అందరి ముందు నిలిచాడు. అతని జర్నీని అతని మాటలల్లోనే తెలుసుకుందాం.
మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మ సత్యవతి (గహిణి), చంద్రశేఖర్ రాజు (పోలీస్ హెడ్ కానిస్టేబుల్) అక్క ధనలక్ష్మి, చెల్లి శ్రీదేవి, తమ్ముడు మణికంఠ రాజు. ఇదే నా ప్రపంచం. మాది విజయనగరం. మా ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే. నాకు చిన్నప్పటి నుంచి చదువుపై కంటే సంగీతంపైనే ఆసక్తి ఉండేది. దీంతో సంగీతం నేర్చుకోవాలనేది నా అభిలాష. కాని, కుటుంబ పరిస్థితులు నా ఆశలపై నీళ్లు కుమ్మరించాయి. దీంతో ఒంటరితనాన్ని ఆశ్రయించాను. అదే నాకు కవిత్వం రాయడం నేర్పింది. తరువాత పాటకు పురుడుపోసింది. రాయడం వచ్చింది కదా స్వరం ఎందుకు కట్టలేను అని నాలో నేనే మదన పడేవాడ్ని. అలా నా సాహిత్యానికి నేనే స్వరాలూ కూర్చుకునే వాడ్ని. ఇలా వచ్చిరాని ప్రయోగాలతో చేస్తున్న తప్పొప్పులు తెలుసుకుంటూ సంగీతం మీద ఒక కనీస అవగాహన తెచ్చుకున్నాను. అలా నా అభిలాష మళ్ళీ చిగురులు తొడిగింది.
ఆక్స్ఫర్డ్ డిక్షనరే నా తొలి గురువు
మనసుంటే మార్గం ఉంటుంది. సంగీతం నేర్చుకోవాలనే తపనే నాకు అనేక మార్గాలను పరిచయం చేసింది. నేను ఏం నమ్మానో అదే ఆచరించాను. మ్యూజిక్ అనే పదానికి అర్ధం వెతుకుంటూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో మ్యూజిక్‌కి సంబందించిన ప్రతి పదాన్ని తెలుసుకున్నాను. అలా నా సంగీతానికి తొలి గురువు ఆక్స్ఫర్డ్ డిక్షనరే. దానితో సంగీతం అంటే మక్కువ ఇంకా పెరిగింది. దైర్యం చేసి అప్పటికే దాచుకున్న కొంత నగదుతో విజయనగరం మహారాజ సంగీత కళాశాలలో 2000 సంవత్సరంలో వయోలిన్ నేర్చుకోవటానికి అడ్మిషన్ తీసుకొన్నాను. అంత సిద్ధం అనుకుంటుండగా అక్కడ ఒకరు ఏదైనా పాట పాడమని అడిగారు. నేను పాడలేకపోయాను. వయోలిన్ నేర్చుకోవాలి అంటే స్వరాలూ పాడటం రావాలి లేదంటే వయోలిన్ చాలా కష్టం అని చెప్పి, చూడటానికి బావున్నావు కదా భరతనాట్యం నేర్చుకోమన్నారు. ఒకటి అనుకుంటే మరోకటి అయ్యిందని చాలా బాధపడ్డాను. ఎంతో కష్టపడి దాచుకొని కట్టిన డబ్బు పోతుంది ఏమో అని భరతనాట్యం నేర్చుకున్నాను. ఇంట్లో తెలియకుండా కాలేజీకి అని చెప్పి మ్యూజిక్ క్లాసులకు వెళ్లేవాడ్ని. అదే సమయంలో విజయనగరంలో వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించే ఒకే ఒక్క మ్యూజిక్ స్కూల్ 'షాలోమ్ మ్యూజిక్ స్కూల్' గురించి తెలుసుకొని వెళ్లి కలిశాను. నా పరిస్థితి పూర్తిగా వివరిస్తే నా ఆసక్తిని గమనించి షాలోమ్ ప్రసాద్ సార్ ఉచితం గానే గిటార్, కీబోర్డ్ నేర్పిచారు.
గురజాడ లైబ్రరీ మరో గురువు
నా సంగీతానికి మరో పరోక్ష గురువు విజయనగరం గురజాడ లైబ్రరీ. అప్పటికి ఇంటర్ నెట్ వాడకం ఊర్లో అంత లేదు. ఉన్నా అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. దానితో నా సందేహాలను నివత్తి చేసుకోవడానికి గురజాడ గ్రంథాలయం నాకు బాగా ఉపయోగపడింది. అక్కడే నేను సంగీతానికి సంబందించిన చాలా పుస్తకాలు చదివాను. మ్యూజిక్ కాలేజీలో మిగిలిన స్నేహితుల దగ్గర వాళ్ళ సిలబస్ థియరీ నోట్స్ తీసుకొని చదువుకునే వాడిని. అలా కర్నాటిక్ సంగీతం, వెస్ట్రన్ మ్యూజిక్ రెండిటి మీద చాలా అవగాహన పెంచుకున్నాను. అప్పటికే నేను 200కి పైగా పాటలు రాసి స్వరాలూ సమకూర్చుకున్నాను. అప్పట్లో పాప్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తుంది. నేను కూడా పాప్ స్టార్ అవ్వాలి అని బాగా కలలు కనే వాడిని. వాటిని నిజం చేసుకోవటానికి కూడా అంతే శ్రమ పడే వాడిని.
ఎదో తెలియని అసంతప్తి
నేను మ్యూజిక్ నేర్చుకుంటున్న విషయమే మా ఇంట్లో తెలియదు. అలాంటప్పుడు ఇంట్లో సాధన కూడా చేయలేని పరిస్థితి. పైగా నా కంటూ వాయిద్యం లేదు. థీయరీ ఎంత తెలుసుకున్నా సాధన చెయ్యాలి. అందుకోసం కచ్చితంగా ఎక్కువ సమయం మ్యూజిక్ స్కూల్ లో ఉండాల్సి వచ్చేది. అసలే దొంగ చాటుగా నేర్చుకుంటున్నది. ఎవరికీ అయినా తెలిస్తే ఇంట్లో జరిగే పరిణామాలు ఏంటో నాకు బాగా తెలుసు. ఏదోలా ఇంటర్, డిగ్రీ కంప్లీట్ అయ్యే ఆ అయిదు సంవత్సరాలు లో డిగ్రీతో పాటు మ్యూజిక్ మీద కొంత పట్టు కూడా సాధించాను.
ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండానే హైదరాబాద్ 2005లో వచ్చాను. నా వంతు చాలా సినిమా ప్రయత్నాలు చేశాను. ఒక సమయంలో ఉండటానికి తినటానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అవకాశాలు వచ్చే వరకు అలానే ఉంటే ఆరోగ్యం, జీవితం రెండు పాడు అవుతాయేమో అనిపించేంది. నాకు తెల్సిన విద్య చెప్పుకుంటూ అవకాశాలు ప్రయత్నిద్దాం అని సంగీతం మాస్టారుగా చాలా స్కూల్స్‌లో పనిచేశాను. హౌమ్ ట్యూషన్స్ కూడా చాలా చెప్పను. అలా 2011 వరకు పని చేస్తూ ప్రయత్నించాను. మళ్ళి అసంతప్తి. హైదరాబాద్ వచ్చింది సినిమాలకి సంగీతం చెయ్యాలి అని, సంగీతం టీచర్‌గా ఉద్యోగం కోసం కాదు అని ఆ ఉద్యోగాలు అన్ని రిజైన్ చేసి, అప్పుడప్పుడే మొదలవుతున్న షార్ట్ ఫిలిం ట్రెండ్‌ని దష్టిలో పెట్టుకొని, చిన్న పని చేసిన గౌరవంగా చేసుకుంటూ పొతే మనసు హాయిగా ఉంటుంది అని నమ్మి షార్ట్ ఫిలిమ్స్‌కి పెద్ద సినిమా స్థాయి మ్యూజిక్ ఇవ్వటం మొదలు పెట్టాను. అప్పట్లో సినిమా మ్యూజిక్‌ని కాపీ చేసి షార్ట్ ఫిలిమ్స్‌కి ఎక్కువగా వాడే వారు , షార్ట్ ఫిలిమ్స్‌కి అంతలా బడ్జెట్ లేకపోవటం దానికి కారణం, ఒరిజినల్ మ్యూజిక్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ. వేళ్ళ మీద లెక్కపెట్టే అంతమంది మాత్రమే ఒరిజినల్ మ్యూజిక్ ఇచ్చే వారు. నేను మ్యూజిక్ టీచర్‌గా చేసి సంపాదించేయినా ప్రతి రూపాయి షార్ట్ ఫిలిమ్స్ మ్యూజిక్ కోసం మాత్రమే ఖర్చుపెట్టే వాడిని. 2014కి చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పేరు సంపాదించుకున్నాను. 'షార్ట్ ఫిలిం మ్యూజిక్ మాస్ట్రో' అని అందరు అంటూ ఉండేవాళ్ళు, సినిమా స్థాయి సంగీతాన్ని షార్ట్ ఫిలిమ్స్‌లో కంటిన్యూన్గా ఇచ్చిన ఒకే ఒక 'మ్యూజిక్ డైరెక్టర్' నేనే.
నేను చేసిన సంగీతం కోసం ఫిలిమ్స్‌ని రిపీట్‌గా చూసి అభినందించే వాళ్ళు ఎక్కువ అయ్యారు. సొంతోషం అనిపించింది. అదే నాకు పెద్ద అవార్డుగా భావించాను. నా మ్యూజిక్‌కి ఒక బ్రాండ్ మార్క్ సంపాదించుకున్నాను. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నాను. అప్పుడే అర్ధం అయ్యింది ఇంకా చాలా వుంది అని. డబ్బు కోసం ఏ రోజు పని చెయ్యలేద. కానీ ఇష్ట పడ్డ పని చిన్నదైనా మొహమాటం లేకుండా గౌరవంగా చేసుకుంటే అందులో ఆనందం ఉంటుందని ఆలస్యంగా అర్ధం అయ్యింది. చాలా మంది హేళన చేసారు. చిన్న చూపు చూశారు. నవ్వేసి నా పనిలో నేను ఉన్నాను. మనకి ప్రపంచం అంత తిరగాలి అని ఉంటాది. కానీ అవకాశం లేనప్పుడు ఉన్న చోటనే నచ్చిన పని చేసుకుంటూ ఉంటే ఎదో ఒక రోజు ప్రపంచమే మన చుట్టూ తిరుగుతుంది అని బలంగా నమ్ముతున్నాను.
మన పనిలో మనం పిచ్చిగా ఉంటేనే , ఎదో ఒక రోజు కచ్చితంగా జనాలు మనమంటే పిచ్చెక్కి పోతారు. అవకాశం ఉన్నప్పుడు ఆసక్తి ఉండదు. ఆసక్తి ఉన్నప్పుడు అవకాశం ఉండదు. కాబట్టి మనకి నచ్చిన పని చెయ్యాలి , అలానే మన వరకు వచ్చిన పని కూడా చెయ్యాలి .
ఇక్కడ నిజం కన్నా నమ్మకం చాలా గొప్పది .
నాకు నామీద చాలా నమ్మకం ఉంది .
మీరు నమ్మే రోజు కూడా త్వరలోనే వస్తుంది
ఇష్ట పడ్డ పనిని ఎవరికోసమో ఎప్పటికి వదిలెయ్యొద్దు .
ఎక్కడపోయిన దాన్ని అక్కడే వెతుకోవాలి
ప్రస్తుతానికి నేను అదే పనిలో ఉన్నాను .
2011లో శ్రద్ధ సెంటర్ ఫర్ స్పెషల్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్స్ తో రవీంద్ర భారతి లో ఇచ్చిన ప్రదర్శన ఎప్పటికి మరిచి పోలేనిది. ప్రవాస ఆంధ్రులలో షార్ట్ ఫిలిమ్స్ చేసే ఎక్కువ శాతం మంది పివిఆర్ రాజాతో సంగీతం చేయించుకోవటం విశేషం.
అమెరికా, లండన్, సింగపూర్, ఆస్ట్రేలియా, కంబోడియా ప్రాంతాలలో తెలుగు షార్ట్ ఫిలిం మేకర్స్‌కి దాదాపు రాజా నే సంగీతం సమకూరుస్తారు .
ఈ మధ్య రాజా సంగీతం సమకూర్చిన వెన్నెల వచ్చే పదమని పాటకి సంగీత దర్శకుడు కోటిగారు అభినందనలు కురిపించారు . సింగర్ కారుణ్య ఈ పాటని పాడారు. ఈ టీవీ డీ డాన్స్ ప్రోగామ్మ్ విన్నర్ యశ్వంత్ మాస్టర్‌తో చేసిన ''దిల్ అంత అదిరే'' వీడియో ఆల్బం చాలా పెద్ద హిట్ అయ్యింది.
కేవలం షార్ట్ ఫిలిం అత్యధికంగా చేస్తూ ఐఎండిబి, తెలుగు వికీపీడియాలో స్థానం సొంతం చేసుకున్నారు. కేవలం ప్రముఖ వ్యక్తులకి మాత్రమే ఇచ్చే బ్లూ టిక్స్ ని సొంతం చేసుకున్నారు .
పేస్ బుక్, రజూశ్ మ్యూజిక్, ఆపిల్ మ్యూజిక్ , అమెజాన్ మ్యూజిక్, శీ సావన్ ఆర్టిస్ట్‌గా బ్లూ టిక్‌ని సొంతం చేసుకున్నారు. గూగుల్ వెరిఫైఎడ్ మ్యూజికల్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు .
షార్ట్ ఫిలిం ఇండిస్టీలోనే సెలబ్రిటీగా అన్ని అర్హతలు సాధించి, సినిమా వాళ్ళ క్రేజ్‌కి ఏ మాత్రం తీసిపోకుండా ఫోల్లోవెర్స్ని రోజు రోజుకి పెంచు కుంటూ పోతున్నారు .
హైదరాబాద్‌లో 2006 నుంచి 2011 వరకు పలు పాఠశాలల్లో సంగీతం ఉపాధ్యాయుడిగా పని చేసాను. 2012 నుంచి, ఇప్పటి వరకు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, ఆంగ్ల అన్ని భాషల్లో కలిపి సుమారు 150కి పైగా లఘుచిత్రాలకి సంగీత దర్శకుడిగా పని చేసాను.
సంగీత పోటీలలో విజేతగా
- 2005 విజయనగరం జిల్లా స్థాయి యువజనోత్సవ పోటీలలో తతీయ స్థానం
- 2007 చెన్నై లో ఏ. ఆర్ . రెహమాన్ నిర్వహించిన హూ.. లలల్లా .. మ్యూజిక్ బ్యాండ్ హంట్ లో పాల్గొని షాలోమ్ బ్యాండ్ తరుపున టాప్ 18 లో నిలిచాడు .
- 2011 లో ప్రకాశం జిల్లా యువజనోత్సవాలలో ప్రధమ స్థానం .
- 2011 హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలలో సొంతంగా రాసి కంపోజ్ చేసుకున్న పాటకు లైట్ మ్యూజిక్ విభాగంలో రాష్ట్ర స్థాయి అవార్డు .
- 2011 , ప్రతి ఏటా భారత ప్రభుత్వం నిర్వహించే జాతీయ స్థాయి యువజనోత్స పోటీలలో ఉమ్మడి సమైక్య ఆంధ్ర ప్రదేశ్ తరుపున ప్రధమ స్థానం లో నిలిచి , గిటార్ విభాగంలో ఉదయపూర్ రాజస్థాన్ లో జరిగిన పోటీలకి జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారు
- 2013 హైదరాబాద్ టైమ్స్ ఫ్రెష్ పేస్ 2013 కంపిటిషన్స్ లో ఫైనల్స్ కి ఎంపిక అయ్యారు .
- కేవలం 2017 ఒక్క సంవత్సరంలో నే తాను సంగీతం చేసిన లఘు చిత్రాలకి గాను వరుసగా - సార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు .
- 2016 తెలుగు షార్ట్ ఫిలిమ్స్ లో నిరంతర సంగీత సేవలకు గాను షార్ట్ ఫిలిం డైమండ్ అవార్డు (నవరత్నాలు)తో సత్కరించారు.
సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చిన వాటిలో కొన్ని చిత్రాలు
మ్యూజిక్ చేసిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్
ఒక్క క్షణం
నువ్వు నేను ఈ క్షణం
ఊపిరిలో ఊపిరిగా
ఎల్బి శ్రీరామ్ రూట్స్ i did it
ప్రశంస
కళ్యాణం
మైథిలి
అక్షయ
ఆర్య 3
మ్యూజిక్ చేసిన కొన్ని ఇండిపెండెంట్ ఫిలిమ్స్
హ్యాపీ ఎండింగ్ అద్విక
ఆకాశమంత ప్రేమ
నా సీతామహాలక్ష్మీ
హ్యాపీ మారీడ్ లైఫ్ ( కన్నడ )
పుష్ప విలాపం
మ్యూజిక్ చేసిన కొన్ని వెబ్ సిరీస్
గీతాసుబ్రమణ్యం
మైఖేల్ మదన్ కామరాజు
మాయ
బి నెగటివ్
మ్యూజిక్ చేసిన కొన్ని ఓటీటీ ఫిలిమ్స్ ఆత్మారామా ఆనందరమణ
విటమిన్ షి
మాయ
చారు కహాని
సమిధ
మ్యూజిక్ చేసిన కొన్ని పెద్ద చిత్రాలు
జంధ్యాల రాసిన ప్రేమ కథ
సంశయం
టచ్ మీ నాట్
మిట్టి బ్యాక్ టు రూట్స్ (హిందీ)
విడుదలకి సిద్ధంగా ఉన్నపెద్ద చిత్రాలు
మది
చుక్కల్లో ఉండే కుందేలు
మరో ప్రపంచం
ఓం శ్రీ సత్యదేవా ఫిలిమ్స్ (ఆర్.ఆర్)
రెస్పాన్సిబిల్ మెన్
అండ్ రెస్పెక్టబుల్ ఉమెన్,
పేపర్ బారు
షార్ట్ ఫిలిమ్స్‌లో ఉత్తమ సంగీత దర్శకుడిగా పొందిన అవార్డ్స్
- 2016 లోటస్ ఫిలిం అవార్డ్స్ ఉత్తమ సంగీత దర్శకుడు (ఇట్లు మీ లైలా)
- 2017 ఉదయ్ కిరణ్ సినీ అవార్డ్స్ (ఊపిరిలో ఊపిరిగా)
- 2017 లోటస్ ఫిలిం అవార్డ్స్ ఉత్తమ సంగీత దర్శకుడు ( ఆకాశమంత ప్రేమ)
- 2017 స్టార్ హంట్ (ఇట్లు మీ లైలా)
- 2017 గాయత్రి సినీ అవార్డ్స్ (హ్యాపీ ఎండింగ్)
- 2017 సఖి ఈవెంట్స్ వరుణ్ బజాజ్ అవార్డ్స్ 2017 (ఊపిరిలో ఊపిరిగా)
- 2017 దశ్య షార్ట్ స్టోరీస్ బిగ్ ఐడియాస్ (లాస్ట్ కాల్)
- 2017 ఇంటర్నేషనల్ తెలుగు షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2017 (ఇట్లు మీ లైలా)
- 2018 లోటస్ ఫిలిం అవార్డ్స్ ఉత్తమ సంగీత దర్శకుడు (ఒక్క క్షణం)
- 2018 ఉదరు కిరణ్ సినీ అవార్డ్స్ (ఒక్క క్షణం)
- 2018 స్టూడియో వన్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నామినీ (ఒక్క క్షణం)
- 2020 సైమా షార్ట్ ఫిలిం అవార్డ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ నామినీ (అంతరార్ధం)
- 2020 రాంగోపాల్ వర్మ నిర్వహించిన స్పార్క్ షార్ట్ ఫిలిం కాంటెస్ట్ లో , తొమ్మిదివేల ఎంట్రీలలో, పీవీఆర్ రాజా నేపధ్య సంగీతం చేసిన 3 చిత్రాలు టాప్ 18లో నిలిచాయి, వాటిలో రెండు చిత్రాలు టాప్ 5లో స్థానం సంపాదించి ఉత్తమ చిత్రాలుగా అవార్డ్స్ సొంతం చేసుకున్నాయి.
#PVRRaja #PVRRajaMusicDirector #pvrraja #PVRRajaNavatelangana
#ShortFilmMaestro #PVRRajaNews #musicdirectorpvrraja
#pvrrajashortfilms #pvrrajanewsarticle
- అనంతోజు మోహన్‌కృష్ణ