Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలం...
తుఝ్ లబ్ కీ సిఫత్ లాల్-ఎ-బదక్షాఉ సూ కహూంగా
జాదూ హై తిరే నైన్ ఘజాలాఉ సూ కహూంగా
దీ బాద్శహీ హఖ్ నే తుఝే హుస్న్-నగర్ కీ
యూ కిశ్వర్-ఎ-ఈరాన్ మే సులైమాఉ సూ కహూంగా
ముఝ్ పర్ న కరో జుల్మ్ తుమ్ ఐ లైలి-ఎ-ఖుబా
మజ్నూ హూ తిరే ఘమ్ కూ బయాబాఉ సూ కహూంగా
జల్తా హూ శబ్-ఒ-రోజ్ తిరే ఘమ్ మే ఐ సజన్
యే సోజ్ తిరా మషాల్-ఎ-సోజాఉ సూ కహూంగా
బే-సబ్ర్ న హౌ ఐ 'వలీ' ఇస్ దర్ద్ సూ హర్గిజ్
జల్తా హూ తిరే దర్ద్ మే దర్మాఉ సూ కహూంగా
అనువాదం:
ఎర్రగ మెరిసే రూబీలతోనే నీ పెదాలను పోల్చాలని చెబుతాను
నీ కనులలోనున్న మాయను గురించి జింకలతో నే చెబుతాను
సౌందర్యపురపు రాజ్యాధికారం సష్టి రచించినవాడు నీకిచ్చాడు
నేనీ విషయం ఈరాను రాజ్యపు సులైమా రాజుతో చెబుతాను
అందమైన ఓ లైలా, నా మీద నువ్వు అణచివేతను సాగించకు
మజ్నూని నేను, నీవల్ల నే పడిన వేదనను ఎడారికి చెబుతాను
పగలూ రాత్రి కాలిపోతుంటాను నీ దుఃఖాగ్నిలో నేను, చెలీ!
నువ్ పుట్టించే వేడిని గూర్చి మండుతున్న దీపంతో చెబుతాను
ఓ 'వలీ', ఈ వేధింపుల వల్ల నువ్వు ప్రతిసారీ చలించిపోవద్దు
నీ వేదనల వల్ల జ్వలించిపోతానని నే ఔషదంతో చెబుతాను.
వలీ ఔరంగాబాద్‌లో ఉన్నప్పటి నుండే అక్కడి వ్యవహారిక భాష అయిన దక్కనీలో కవిత్వం రాసేవాడు. ఇతని కవితల్లో సరికొత్త ఉపమానాలు, రూపకాలు, జాతీయాలు విరివిగా ఉండడం వల్ల తన కవిత్వం ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇదే సమయంలో ఢిల్లీలో ఉన్న భాషా వాతావరణం, కాస్త భిన్నంగా ఉండేది. ఢిల్లీ ప్రజల వ్యవహారిక భాష పేరు రేఖ్తా. అప్పటివరకు ఈ భాష తక్కువ స్థాయి భాషగా పరిగనించేవారు. కవులు ఈ భాషలో కవిత్వం రాయడం అవమానమని, అసలు ఇది కవిత్వానికి పనికిరాదని భావించేవారు. పైగా అక్కడి కవులందరూ ఫారసీలో రాయడానికే మొగ్గు చూపేవారు. కానీ ఎప్పుడైతే వలీ ఢిల్లీలో అడుగుపెట్టాడో, అప్పటి నుండి అక్కడి కవిత్వ పంథా మారడం మొదలైంది. వలీ తన వ్యవహారిక భాషలో సంకలనం చేసిన గజళ్ళ దీవాన్ ని, ఢిల్లీ కవులు చదివి ఆశ్చర్యపోయారు.
ఉర్దూ మహాకవి వలీ ముహమ్మద్ వలీ 17వ శతాబ్దంలో జన్మించాడు. ఇతనికి వలీ దక్కనీ, వలీ గుజరాతీ, వలీ ఉద్దీన్ వలీ మొదలైన పేర్లున్నాయి. ఇతని జీవనవిధానమే దీనికి కారణం. వలీ ఒక నోమాడ్. జ్ఞానాన్ని సంపాదించాలనే ఉద్దేశంతో అహ్మదాబాద్, ఔరంగాబాద్, సూరత్, ఢిల్లీ ఇలా ఉత్తర దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించాడు. ఉర్దూ సాహిత్య చరిత్ర ప్రకారం, వలీని ఉర్దూలో కవిబ్రహ్మగా వ్యవహారిస్తారు. వలీ కవిత్వంలో భాష, తాజాదనాన్ని కలిగి ఉంటుందని విశ్లేషకులు అంటారు. మీర్, ముశాఫీ వంటి మహాకవులు కూడా, వలీ దీవాన్ చదివి ప్రేరణ పొంది తమ శైలిని ఏర్పరుచుకున్నారు. వలీ గొప్పదనాన్ని మరింతగా తెలుసుకోవాలంటే ఉర్దూ సాహిత్య చరిత్ర తప్పక చదవాల్సిందే.
కిందటి ఎపిసోడ్లో చెప్పుకున్నట్లుగా, ఉర్దూ గజల్ వ్యాప్తి 17వ శతాబ్దంలో దక్షిణం నుండి ప్రారంభమైంది. ఇందులో వ్యాప్తికి కారకుడైన వలీ గురించి చర్చించుకోవాల్సిన అవసరముంది. వలీ ఔరంగాబాద్‌లో ఉన్నప్పటి నుండే అక్కడి వ్యవహారిక భాష అయిన దక్కనీలో కవిత్వం రాసేవాడు. ఇతని కవితల్లో సరికొత్త ఉపమానాలు, రూపకాలు, జాతీయాలు విరివిగా ఉండడం వల్ల తన కవిత్వం ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇదే సమయంలో ఢిల్లీలో ఉన్న భాషా వాతావరణం, కాస్త భిన్నంగా ఉండేది. ఢిల్లీ ప్రజల వ్యవహారిక భాష పేరు రేఖ్తా. అప్పటివరకు ఈ భాష తక్కువ స్థాయి భాషగా పరిగనించేవారు. కవులు ఈ భాషలో కవిత్వం రాయడం అవమానమని, అసలు ఇది కవిత్వానికి పనికిరాదని భావించేవారు. పైగా అక్కడి కవులందరూ ఫారసీలో రాయడానికే మొగ్గు చూపేవారు. కానీ ఎప్పుడైతే వలీ ఢిల్లీలో అడుగుపెట్టాడో, అప్పటి నుండి అక్కడి కవిత్వ పంథా మారడం మొదలైంది. వలీ తన వ్యవహారిక భాషలో సంకలనం చేసిన గజళ్ళ దీవాన్ ని, ఢిల్లీ కవులు చదివి ఆశ్చర్యపోయారు. వారికి వలీ ప్రయోగించిన భాష, వారి వ్యవహారిక భాష అయిన రేఖ్తా రెండూ ఒకేలా తోచాయి. అలా తమ సొంత వ్యవహారిక భాషలో కవిత్వం విన్న ఢిల్లీ కవులు ముగ్ధులై పోయారు. ఇక్కడొక సందేహం ఏర్పడుతుంది. వలీ ఉపయోగించిన భాష (దక్కనీ), ఢిల్లీ ప్రజల వ్యవహారిక భాష (రేఖ్తా) రెండూ ఒకటిగా ఎలా ఉండగలవు? విషయమేమంటే అసలు ఉర్దూ అనే పదమే 20వ శతాబ్దంలో వాడకంలోకి వచ్చింది. అప్పటివరకు ఉర్దూకి దక్షిణంలో దక్కనీ అని, ఉత్తరంలో రేఖ్తా అని, ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లు ఉండేవి. వలీ భాష, ఢిల్లీ ప్రజల భాష ప్రాంతీయంగా భిన్నమైనవే అయినా, వాటి ఆత్మలు రెండూ ఒక్కటే (మరింత సమాచారం కోసం ఉర్దూ భాషా పరిణామాన్ని చూడండి). ఢల్లీలో వలీ ఆగమనం, తన తరువాత తరాల కవులను సైతం ప్రభావితం చేసింది. మహాకవులైన మీర్, ముశాఫీ, గాలిబ్ జననం వల్ల ఉర్దూ భాష, ఉర్దూ భాషకు ప్రాణమైన ఉర్దూ గజల్, ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్జించడమే గాక భారతదేశపు వైవిధ్యమైన సంస్కతీ సంప్రదాయాలకు ఒక అందమైన ప్రతిరూపంగా నిలిచింది.
- ఇనుగుర్తి లక్ష్మణాచారి, 94410 02256