Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతిమక్షణాలదాక మనని అంటిపెట్టుకుని ఉండే ఆత్మీయ నేస్తం ఇదొక్కటే. వ్యక్తుల నిత్యజీవిత విషయాలను, కుటుంబ సంబంధాలను, స్నేహ బంధాలను, వత్తిపర విషయాలను మాత్రమే కాక వారివారి అభిరుచులను, అభిప్రాయాలను, ఆకాంక్షలను, ఆంతర్యాలను, అలవాట్లను, ప్రవర్తనారీతులను, ఆశాభంగాలను పట్టిచూపేది డైరీ.
డైౖరీ ...మనల్ని మనం గీసుకునే చిత్రం, మనల్ని మనం చెక్కుకునే శిల్పం, మనల్ని మనం చూసుకునే అద్దం. ఒక్కమాటలో చెప్పాలంటే అది మన మనోనేత్రం. డైరీ.. ఒకరి నేస్తం, మరోకరికి ఆత్మీయురాలు, ఇంకోకరికి ప్రియురాలు. అందుకే దానిని అంత ప్రేమగా చూసుకుంటారు. అక్కున చేర్చుకుంటారు. హదయానికి హత్తుకుంటారు. ఒక్కోసారి కన్నీటితో సంద్రమయితే.. ఇంకోసారి ముద్దుల వర్షంలో తడుస్తుంది. పడక మీదనో, తలగడ కిందనో భద్రంగా ఇప్పటికి చాలా మంది దాచుకునేవారు ఉన్నారు. పాత జ్ఞాపకాలను మననం చేసుకుంటూ వారు హాయిగా నిదురించే వారు కొందరైతే.. బరువెక్కిన గుండెతో నిదుర రాని రాత్రులు గడిపేవారు ఎందరో. బాల్యాన్ని, యవ్వనాన్ని, వద్ధాప్యాన్ని, ప్రేమను, ఒంటరితనాన్ని అందులో పంచుకుంటారు. ప్రతీ జ్ఞాపకాన్ని దారంతో పూలమాల కట్టినంత పదిలంగా అక్షరాలను అల్లుతూ, పొందికగా, అపురూపంగా రాసుకుంటారు. కానీ కాలం మారింది. ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్ యుగం అయ్యింది. అయితే స్మార్ట్‌ఫోన్ లేకపోతే ల్యాప్‌టాప్.
బహుశా అంతిమక్షణాలదాక మనని అంటిపెట్టుకుని ఉండే ఆత్మీయ నేస్తం డైరీనే. వ్యక్తుల నిత్యజీవిత విషయాలను, కుటుంబ సంబంధాలను, స్నేహ బంధాలను, వత్తిపర విషయాలను మాత్రమేకాక వారివారి అభిరుచులను, అభిప్రాయాలను, ఆకాంక్షలను, ఆంతర్యాలను, అలవాట్లను, ప్రవర్తనారీతులను, ఆశాభంగాలను పట్టిచూపేది డైరీ. కాలంతో పాటు సాగుతూ, గడచిన కాలాన్ని నమోదు చేయడం, ఆయా అనుభూతులను, అనుభవాలను, స్మతులను, ఆనందాల్ని, బాధల్ని అక్షరబద్ధం చేయడం డైరీ చేసే పని. డైరీ రాయడం అంటే... వ్యక్తులు తమే తమ అంతరంగాన్ని తమ ముందు పరిశీలనకు పెట్టుకోవడం. ఏ దాపరికాలు, భయాలు, వంచనలు లేకుండా అంతరంగాలను విప్పి తమ ముందు పరుచుకోవడం. అందుకే డైరీలను వ్యక్తిత్వానికి నిలువుటద్దాలు అంటారు. ప్రపంచవ్యాప్తంగా కొందరు ప్రముఖుల డైరీలు - సాహిత్యాన్ని, సమాజాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. ప్రముఖ రాజకీయవేత్తలు సైతం తమ అనుభవాలను, ఇతరులతో పంచుకోడానికి ఇష్టపడని అనేక విషయాలను డైరీలలో పొందుపరి చేవారు. పీసీలు, ల్యాప్‌టాప్‌లనూ ఉపయోగించినప్పటికీ, స్మార్ట్ఫోన్ల రాకతో మనిషి యాటిట్యూడ్ మొత్తంగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు మనిషికి ఒక అవయవంగా మారింది. స్మార్ట్‌ఫోన్ ఒక అంగంగా మారిన తర్వాత... గతంలో మనిషి అవసరాలను తీర్చిన అనేక వస్తువులు నేడు కనుమరుగవుతున్నాయి. అలా కనుమరుగైన వస్తువుల జాబితాలో చేరినవాటిలో డైరీ కూడా ఒకటి. ఇప్పుడంతా డిజిటల్ యుగం. 'మనకంటూ చరిత్రలో కొన్ని పేజీలుండాలి' అన్నది పాత సామెత. 'మనకంటూ అంతర్జాలంలో కొన్ని పేజీలుండాలి..!' అన్నది కొత్త మాట. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, బ్లాగ్స్ వంటి వాటిలో మన అభిరుచికి తగ్గట్టుగా కావాల్సినన్ని పేజీలు సష్టించుకోవచ్చు. మన భావాలను, అనుభవాలను రాసు కోవచ్చు. చేతితో రాయాల్సిన అవసరం లేకుండానే టైపింగ్ ప్యాడ్లు వచ్చేశాయి. మన పనిని మరింత సులభతరం చేశాయి. దిండుకిందనో, టేబుల్ మీదనో వుండాల్సిన డైరీలు ట్యాబ్స్, స్మార్ట్ఫోన్లలో ఆన్‌లైన్‌తో పనిచేసే నోట్ బుక్లుగా, డైరీ యాప్‌లు, జర్నల్స్గా మారిపోయాయి.
డిజిటల్ డైరీ
డిజిటల్ డైరీ అనేది మన వ్యక్తిగత సంఘటనలు, అనుభవాలను, అనుభూతులను ఆన్లైన్లో నమోదు చేయగల ప్రదేశం. మన ఆలోచనలను, భావాలను వ్యక్తీకరించడానికి సాంప్రదాయ డైరీ ఇప్పుడు ఒక యాప్‌గా మారిపోయింది. మన స్మార్ట్‌ఫోన్‌కు ఇంటర్నెట్ వుంటే చాలు... ఎక్కడున్నా ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా డైరీని క్రియేట్ చేసుకోవచ్చు. మన భావాలను రాసుకోవచ్చు. సాంప్రదాయ డైరీల్లో ఏం రాస్తే ఎవరు చూస్తారోననే భయం ఒకింత వుండేది. కానీ నేటి డిజిటల్ డైరీల వల్ల ఆ భయం లేదు.
మీకు డైరీలో రాసే అలవాటుంటే- సాధారణ డైరీ కొనక్కర్లేకుండానే మీ స్మార్ట్‌ఫోన్‌లోనే డిజిటల్ డైరీ రాసేయొచ్చు. ఎప్పటికప్పుడు తేదీల వారీగా రాసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్‌కి అనుసంధానం చేసుకోవడం ద్వారా ఎంత సమాచారాన్నయినా దాచుకోవచ్చు. అంతేకాకుండా సందర్భాన్ని బట్టి ఫొటోలను, మూడ్స్‌ను బట్టి ఎమోజీలను కూడా జత చేయవచ్చు. చాలామంది తమతమ పనులలో ఒత్తిడిలో డైరీని రాయడం మర్చిపోతుంటారు. అలాంటి వారు ఇందులో ఉన్న రిమైండర్కు టైమ్ సెట్ చేసుకుంటే... ఆ సమయానికి దానంతట అదే గుర్తు చేస్తూ నోటిఫికేషన్ పంపుతుంది. మనం చేయాల్సిన పనులను ఒక క్రమపద్ధతిలో దీనిలో రాయవచ్చు. ఇచ్చిన సమాచారం ఎంత కాలమైన చెక్కుచెదరకుండా ఉంటుంది. పైగా దీనికి పాస్వర్డ్ ఉండటంతో మన వ్యక్తిగత విషయాలను ఇతరులు తెలుసుకునే అవకాశం వుండదు. కనుక ఇది సులభం, సురక్షితం.
డైరీ యాప్‌లు
Penzu : ఈ డైరీ అత్యంత ప్రాచుర్యం పొందిన ఉచిత డైరీ, జర్నల్, నోట్‌ప్యాడ్. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. వెబ్, ఇతర మొబైల్ ప్లాట్‌ఫామ్‌లకు అనువైన ఉచిత డైరీ ఇది. మన భావాలను, ఆలోచనలను సురక్షితంగా, భద్రంగా వుంచుతుంది. ప్రపంచంలోని ఏ డివైస్ నుండైనా దీన్ని యాక్సెస్ చేయొచ్చు. చాలా సులభంగా సంప్రదాయ డైరీని మరిపించేలా ఉంటుంది. డైరీలా వాడటంతో పాటు వ్యక్తిగత పత్రికగానూ వాడొచ్చు.
Private Diary Free: ఇతరులు డైరీని ఓపెన్ చేయకుండా మాస్టర్ పాస్‌వర్డ్‌ని సెట్ చేయవచ్చు. రాసుకున్న డైరీకి ఫొటోలను ఎటాచ్ చేసే వీలుంది. డైరీలో కావాల్సిన ఎంట్రీలను మెయిల్ చేయవచ్చు. ఎంట్రీల్లో కావాల్సిన వాటిని వెతకొచ్చు. థీమ్స్‌ని అభిరుచి మేరకు సెట్ చేయవచ్చు. ఎంచుకున్న తేదీల మధ్య డైరీ ఎంట్రీలను బ్రౌజ్ చేసి చూసుకునే వీలుంది.
Diary : పేరుకి తగినట్టుగానే సింపుల్ డైరీ ఇది. స్క్రీన్‌పై ఎక్కువ మెనూలు, ఇతర ఆప్షన్లు ఉండవు. డైరీ కింది భాగంలో ఐకాన్ గుర్తులతో కొన్ని ఆప్షన్లు మాత్రమే కనిపిస్తాయి. డైరీ రాసేందుకు పెన్సిల్ని తాకితే చాలు. రాయడం ముగిశాక కేవలం చదివేందుకు అదే పెన్సిల్ని సెలెక్ట్‌చేసి 'రీడ్ఓన్లీ' మోడ్‌లో పెట్టుకోవచ్చు. డైరీ ఫాంట్ పరిమాణాన్ని కావాల్సిన మేరకు పెంచుకోవచ్చు. డైరీలోని మొత్తం ఎంట్రీలను 'లిస్ట్' రూపంలో చూడొచ్చు. ఫోన్లోని ఏవైనా ఫైల్స్, ఇమేజ్‌లను డైరీకి ఎటాచ్ చేసి పెట్టుకోవచ్చు. డైరీలో ఏదైనా పేజీ లేదా మొత్తం డైరీని పీడీఎఫ్ ఫార్మెట్లోకి మార్చుకునే వీలుంది. బొమ్మలు గీసే నైపుణ్యం వుంటే, కుంచె గుర్తుతో కనిపించే ఐకాన్ని తాకి డ్రాయింగ్ టూల్‌ని ఓపెన్ చేయవచ్చు. చిన్నచిన్న బొమ్మలను గీసుకోవచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి పాస్‌వర్డ్‌తో డైరీని సురక్షితం చేసుకోవచ్చు. థీమ్స్ మార్చుకునే వీలుంది. అలాగే, ఫాంట్ స్టైల్స్‌ని కూడా భిన్నమైన సైజుల్లో, రంగుల్లో పెట్టుకోవచ్చు. డైరీని బ్యాక్అప్ తీసుకోవచ్చు.
Diaro: ట్యాబ్, మొబైల్, నోట్‌బుక్... ఏదీ వాడుతున్నా అన్నింటిలోనూ డైరీని అనుసంధానం చేసుకుని వాడుకునేందుకు అనువైన యాప్ ఇది. రోజువారీ షెడ్యూల్స్‌ని సులువుగా మేనేజ్ చేయవచ్చు. 20 భాషల్ని సపోర్ట్ చేస్తుంది. లిస్ట్, క్యాలెండర్ వ్యూస్‌లో డైరీని చూడొచ్చు. ఫాంట్లు, టెంప్లెట్స్‌తో ఎంట్రీలను మార్చుకునే వీలుంది. టెక్స్ట్ సైజుని మార్చుకునే వీలుంది. సెక్యూరిటీ కోడ్ ద్వారా ఎంట్రీలను లాక్ చేయవచ్చు.
Day Journal: రోజువారీ దినచర్యల్ని రాసుకునేందుకు వాడొచ్చు. ఉన్న లోకేషన్‌ని రికార్డ్ చేయడంతో పాటు వాతావరణ వివరాల్ని కూడా అందిస్తుంది. డైరీలోని సమాచారాన్ని బ్యాకప్ చేయవచ్చు. ప్రీమియం వెర్షన్లో మరిన్ని అదనపు సౌకర్యాలు ఉన్నాయి. ఎంట్రీల్లో ఈవెంట్స్ ఉంటే ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ చేయవచ్చు. సోషల్ నెట్‌వర్క్‌ల్లోనూ షేర్ చేయవచ్చు. ఇది ఉచితం కాదు.
Journey : జీమెయిల్తోను, గూగుల్ డ్రైవ్తోను అనుసంధానమై డైరీ రాయవచ్చు. వైఫై నెట్వర్క్కి అనుసంధానమై ఉంటే చాలు. ఆటోమాటిక్‌గా గూగుల్ డ్రైవ్‌కి అనుసంధానం అవుతుంది. ఇక మీ 'జర్నీ' మొత్తం టెక్స్ట్ రూపంలోనే కాదు. ఫొటోలు, వీడియోల్లోనూ నిక్షిప్తం చేసుకోవచ్చు. యాప్‌ని రన్ చేసి 'ప్లస్' గుర్తుతో డైరీ ఎంట్రీలు రాసుకోవచ్చు. ఎంట్రీని సేవ్ చేస్తే మీరు ఉన్న లొకేషన్, అక్కడి వాతావరణ వివరాలు కూడా సేవ్ అవుతాయి. రాసిన ఎంట్రీలో పదాలు, అక్షరాల్ని కూడా లెక్కగట్టి చూపిస్తుంది. యాప్ హౌం మెనూలోకి వెళ్లి డైరీని క్యాలెండర్ వ్యూలో కూడా చూడొచ్చు. డైరీలో అప్లోడ్ చేసిన అన్ని ఫొటోలు, వీడియోలకు ప్రత్యేకంగా ఫొటోస్, వీడియోస్ మెనూ ఉంది. ప్రేరణ కలిగించే సూక్తులను ఇన్స్పిరేషన్ మెనూలో చదువుకోవచ్చు. ఇక యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఫాంట్ సైజు, లైన్ స్పేస్‌లను మార్చుకోవచ్చు. డైరీని 'పాస్‌కోడ్'తో లాక్ చేయవచ్చు.
PERSONAL DIARY with password: సులభమైన ఇంటర్ఫేస్తో ఆకట్టుకునేలా ఈ డైరీని తీర్చిదిద్దారు. రాసిన సమయంలో మన మానసిక స్థితిని బట్టి ఎమోటికాన్స్‌తో సెట్ చేసి పెట్టుకోవచ్చు. రోజు ఎలా గడిచిందో తెలిపేందుకు రేటింగ్ ఉంది. డైరీని పైన కనిపించే స్టార్స్‌తో రేటింగ్ ఇవ్వొచ్చు. ఇక డైరీని ఇతరుల కంట పడకుండా ఉండేందుకు సెట్టింగ్స్‌లోకి వెళ్లి పాస్‌వర్డ్‌ని సెట్ చేసి పెట్టుకోవచ్చు. సెట్టింగ్స్‌లోని ఆప్షన్లతో డైరీ థీమ్‌ని కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌లను మార్చుకునే వీలుంది. డైరీని ఎస్డీ కార్డ్‌లోకి బ్యాకప్ చేసుకోవచ్చు. నెట్‌కి కనెక్ట్ అయితే డైరీని క్లౌడ్‌లోకి సింక్ చేసుకునే వీలుంది.
Diaro: ఈ డైరీని ఫోన్లలోనే కాకుండా ట్యాబ్‌ల్లోనూ వాడుకోవచ్చు. ఫోల్డర్లు, ట్యాగ్‌లతో సహా డైరీ ఎంట్రీలను పోస్ట్ చేయవచ్చు. డైరీకి ఎన్ని ఫొటోలైనా ఎటాచ్ చేసి పెట్టుకోవచ్చు. డైరీని లోకల్ ఎస్డీ మెమరీ కార్డ్‌లోనే కాకుండా 'డ్రాప్‌బాక్స్' క్లౌడ్ సర్వీసుకి అనుసంధానమై బ్యాకప్ చేసుకునే వీలుంది. డైరీ పేజీలను, ఫొటోలను ఇతరులకు షేర్ చేయవచ్చు. నోటిఫికేషన్‌తో రిమైండర్ ఎలర్ట్ని పెట్టుకోవచ్చు. డైరీ యాప్‌లో ఎకౌంట్ వివరాలతో లాగిన్ అయితే క్లౌడ్ని సోర్స్‌లను వినియోగించుకోవచ్చు. డైరీ ఎంట్రీలను సులువుగా వెతికే వీలుంది.
Diary with lock: పాస్వర్డ్ పిన్‌కోడ్ భద్రత, ఎమోజీను త్వరితంగా సెట్ చేసుకోవడం, పింక్, పర్పుల్, బ్లూ బ్యాక్‌గ్రౌండ్ రంగులతో ఇది లభ్యమౌతుంది. దీన్ని ఉపయోగించడం చాలా సులభం. రాసిన ఎంట్రీలను సెర్చ్ చేసుకునే సదుపాయం వుంది. దీనిలో అపరిమిత సమాచారాన్ని నిల్వ చేసుకోవచ్చు.
Daily note diary : మీ ఆలోచనలను మీ కోసం మాత్రమే చూసుకోవాలను కుంటే, అందుకు అనువైన డైరీ ఇది. ఇది సాధారణ వినియోగదారు ఇంటర్ఫేస్తో రోజువారీ ఆలోచనలు, జ్ఞాపకాలను రాయడానికి ఉపకరిస్తుంది. ఫొటోలను అటాచ్ చేసిన మీ జ్ఞాపకాలకు మరింత మధురం చేసుకోవచ్చు.
Diary Book : లాక్‌తో పాస్‌కోడ్ రక్షిత, సరళమైన ఇంకా ఫీచర్ రిచ్, ఉచిత జర్నల్ యాప్. బహుళ ఇతివత్తాలు, గొప్ప వచన ఎంపికలు, విభిన్న ఫాంట్ శైలితో, మీ డైరీని మీ స్వంత అభిరుచితో మలుచుకోవచ్చు. గూగుల్ డ్రైవ్, స్థానిక బ్యాకప్ ఎంపికలతో మీ జ్ఞాపకాలను జర్నల్‌లో భద్రంగా ఉంచుకోవచ్చు.
Daily Diary : లాక్, ఫొటో, మూడ్ చార్ట్ ఉన్న జర్నల్. మీ అద్భుతమైన క్షణాలను రహస్యంగా ఉంచడానికి ఈ డైలీ డైరీ చక్కగా ఉపయోగపడుతుంది. మూడ్ చార్ట్‌లు, నెలవారీ చార్ట్‌లు, వార్షిక చార్ట్‌లను నమోదు చేసుకోవచ్చు. వీటన్నిటికీ అనుకూలమైన రంగురంగుల థీమ్స్‌ను సెట్ చేసుకోవచ్చు.
- అనంతోజు మోహన్ కష్ణ