Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీ అమ్మాయిలంతా
ఒక్కటే అన్నాను
అందంగా నవ్వే ఆ ముఖంలోంచి
రెండు కళ్ళు నా వైపు కోపంగా చూసాయి..
చివరాఖరికి చేయి వదిలి
వెళ్తావేమో భయంగా ఉందన్నాను
బంగారం నేను మరో సలీమ్ ని రా
మర్చిపోయవా..?
ఈ సమాధానంతో పరమానందంలో
మునిగిపోయా...
నన్ను వదిలేయవు కదా అని
ప్రేమగా నెమిరాను
ప్రాణంపోయినా అది మాత్రం జరగదు
ఈసారి సమాధానంతో పాటు
కన్నీళ్లు కూడా రాలాయి..
మనసు కుదురుపడక మళ్ళీ అడిగాను
అందరి అమ్మాయిల్లా నువ్వు కూడా
వదిలేసి వెళ్తావా అని..?
అందరితో నన్ను పోల్చకు
అందరిలాంటి అమ్మాయిని కాదని
తనని తాను నిర్వచించుకుంది...
పిచ్చి ప్రేమలో ఉన్న నేను
ప్రేమ అధ్యాయంలో
''ఆమే ఒక కొత్త నిర్వచనం...''
అనుకున్నాను..
ఇప్పుడు కథా అడ్డం తిరిగింది
ఫ్యామిలీ ఎమోషనల్ తుఫానులో
నా ప్రేమ గాలి గల్లంతయ్యింది...
ప్రేమ పుటలలో అందరి ప్రేమా
ఒక నూతన అధ్యాయమే...
ఓడిపోయిన వారి దారులు
వేరు వేరు అయినప్పటికీ
ఫలితం మాత్రం ఒక్కటే
''చేదు అనుభవం...''
- సలీమ్ , 9703709288