Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమ్మా!
నీ ప్రేమ శాశ్వతం!
మా సంతోషం నీ అణువణువున
ఆనందమై..
నిన్నే నువు మరచి,
మా పై ప్రేమవర్షం కురిపిస్తూ,
మా కన్నీటి జలపాతం
నీ గుండెలో రుధిరమై,
విశ్రాంతి లేని గడియారమై,
రేయి పగలు తేడా లేని శ్రమజీవివి.
మనసులో బాధని దాచి,
ఇంటిని బందావనంగా మలిచే
నీ జీవితమే
మధురమైన కావ్యం..
అమ్మా..
జన్మజన్మలకీ నీ ప్రేమ నే కోరనా!
- సుచిత్ర గూడూరు, ఐఐఐటి బాసర