Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్యం ...
మనిషిని మనిషిగా నిలబెడుతుంది .మనిషిగా మాట్లాడేలా చేస్తుంది. రోజు రోజుకి కాలం అబిడేట్ అవుతోంది. వాక్యం కూడా అబిడేటింగ్ అవుతూ వస్తుంది.యువత పాడై పోతుంది అని ఎవరో ఒకరు అన్న ప్రతీ సారి బాగు పడుతోంది ,బాధ్యతతో అడుగులేస్తుంది అని కూడా గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతూనే వస్తున్న. ''లోకం బాధని తన బాధగా ఎక్కిళ్ళుపట్టి ఏడుస్తోంది. వాక్యంగా మలిచి సాహిత్యంలో కాలాన్ని రికార్డు చేస్తోంది''. యువత ఈ దేశానికి ,లోకానికి బలం. అది ఏ విధంగా చూసుకున్న బలంగానే నిరూపణ అవుతుంది, అవుతది .అట్లాంటి యువత తన శక్తిని ఎంతవరకు ఉపయోగిం చుకుంటుంది? స్మార్ట్ యుగంలో యూత్ దేన్ని కోరుకుంటూ జీవిస్తుంది? యువత సాహిత్యానికి ఏ విధమైన రూపాన్ని ఇవ్వాలనుకుంటుతుంది. ఎటువంటి ప్రయత్నం చేయాలనుకుంటుంది, చేస్తుందో తెల్సుకుందాం.
కవిత్వంలో యువత బలమైన గొంతుగా వినిపిస్తుంది ,కథల్లో కూడా కొంత చురుకు కన్పిస్తుంది. నవల వైపు యువత వస్తుందా రాదా అని సందేహ పడ్డప్పుడు, నవలలకి మళ్ళీ పునర్జన్మ ఇస్తూ ట్రేండింగ్ గా మార్చాలనుకుంటుంది యువత. కానీ నవలలు రాసినప్పటికి అవి బయటకి తీసుకొని పుస్తక రూపాన్ని ఇవ్వడం కొంత ఆలస్యం జరుగుతుంది. కవిత్వం వొచ్చినంత త్వరగా పుస్తకరూపంలో నవల రాకపోవొచ్చు. అలా నవలల నడక నెమ్మదిగా ఉంది కానీ నవల ప్రక్రియ యువతలో దేనితో తీసిపోలేనంత బలంగా ఉందని తెల్సుకోవొచ్చు. మనసు పెట్టి రాస్తే చదివేవాళ్ళు ఉన్నారు అని. ఎందుకంటే బుక్స్ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవాలనో , మైండ్ రిలాక్స్ కోసమో, చుట్టూ ఉన్న హడవడి ప్రపంచాన్ని వదిలి కాసేపు వేరొక ప్రపంచంలోకి వెళ్లాలనో పుస్తకాల కోసం, నవలల కోసం దేవులాడే పాఠలుకు లేకుండా పోలేదు అని ఆశని వ్యక్తం చేస్తున్నారు.
యువతలో పఠనాశక్తి రోజురోజుకి తగ్గుతుంది అని వివిధ సభల్లో వివిధ పెద్దలు మాట్లా డుతూ అంటున్నారు. యువత స్మార్ఫోన్లో తలల్ని ఉపాడమే కాదు దాన్ని సజనా త్మకంగా కూడా తయారుచేసుకుంటుంది అని గమనించాలి.
ఇటీవల జరిగిన హైదరాబాద్ బుక్ఫెయిర్లో ఎక్కువగా కనిపించింది యువతే. ఎక్కువ పుస్తకాల్ని కొనుగోలు చేసింది కూడా వారే. దీన్ని బట్టి యువత ఎక్కువ పుస్తకాలకు ఎడిక్ట్ అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అనేది స్పష్టం అవుతుంది. బీటెక్‌లు, డాక్టర్ కోర్సులు, వివిధ కోర్సులు చదువుతూ, ఉద్యోగాలు చేస్తూ కూడా సాహిత్యాన్ని ఇష్టపడే వాళ్ళు మరింత పెరుగుతున్నారు .యువత చదవడమే కాదు తన జీవితాన్ని, తనుచూస్తున్న జీవితాలను కవిత్వంగా, నవలగా, కథలుగా వారివారి అనుకూల మైన ప్రక్రియల ద్వారా సాహిత్యాన్ని అందిస్తున్నారు. సాహిత్యం ద్వారా మనిషిని మనిషిగా తయారు చేసుకొనేలా అక్షరాన్ని సానబెడుతున్నారు.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 2021లోనే యువత రికార్డ్ సాహిత్యాల్ని పుస్తక రూపంలోకి తీసుకు వచ్చింది. అందులో నవలది ప్రత్యేకమైన స్థానం. మొదటి ప్రయత్నంలోనే నవలా కారులుగా పేరు తెచ్చుకున్న యువ నవలా కారులను ఈవారం జోష్ పలకరించింది. వారి అభిప్రాయాలను తెలుసుకుందాం...
ప్రసాద్ సూరీ -మై నేమ్ ఈస్ చిరంజీవి ఒక అనార్టీస్ట్ కథ (నవల), బాలాజీ - యోధ (నవల), విప్లవ్ కుమార్ - బ్లూ స్కార్ఫ్ (నవల), నర్రా ప్రవీణ్ రెడ్డి - పొత్తి (నవల), భూమిపతనం -గూండ్ల వెంకట నారాయణ (నవల), శ్రీ బాలాజీ టాకీస్ - కరణ్ గోపీనేని వంటి మొదలైన పుస్తకాలు వెలుగులోకి వొచ్చాయి.
కవిత్వంలో యువత బలమైన గొంతుగా వినిపిస్తుంది. కథల్లో కూడా కొంత చురుకు కన్పిస్తుంది. నవల వైపు యువత వస్తుందా రాదా అని సందేహపడ్డప్పుడు, నవలలకి మళ్ళీ పునర్జన్మ ఇస్తూ ట్రేండింగ్‌గా మార్చాలనుకుంటుంది యువత. కానీ నవలలు రాసినప్పటికి అవి బయటకి తీసుకొని పుస్తక రూపాన్ని ఇవ్వడం కొంత ఆలస్యం జరుగుతుంది. కవిత్వం వొచ్చినంత త్వరగా పుస్తకరూపంలో నవల రాకపోవొచ్చు.
అలా నవలల నడక నెమ్మదిగా ఉంది కానీ నవల ప్రక్రియ యువతలో దేనితో తీసిపోలేనంత బలంగా ఉందని తెల్సుకోవొచ్చు.
మనసు పెట్టి రాస్తే చదివేవాళ్ళు ఉన్నారు అని. ఎందుకంటే బుక్స్ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవాలనో , మైండ్ రిలాక్స్ కోసమో, చుట్టూ ఉన్న హడవడి ప్రపంచాన్ని వదిలి కాసేపు వేరొక ప్రపంచంలోకి వెళ్లాలనో పుస్తకాల కోసం, నవలల కోసం దేవులాడే పాఠలుకు లేకుండా పోలేదు అని ఆశని వ్యక్తం చేస్తున్నారు. నవలలు చదివే వాళ్ళు పెరగాలని, యద్దనపూడి, చలం, కేశవరెడ్డి, రంగనాయకమ్మ లాంటి వాళ్ళు ఫామ్‌లో ఉన్నప్పటి పూర్వ వైభవం మళ్ళీ రావాలని. ఇప్పటి కాలంలో చేతన్ భగత్, రవీంద్రసింగ్ లాంటి వాళ్లు ఇంటర్నేషన్ లెవల్లో పాపులర్ నవలా రైటర్స్‌గా ఉండడాన్ని చూస్తే ఇన్స్పిరేషన్తో పాటు ఒకింత ప్రేమతో కూడుకున్న జలసి వస్తుందని. ఇంకెంతో మార్పులకి అనుగుణంగా ముడిపడుతున్న బతుకుల్ని రాయాల్సి ఉందని రికార్డు చేయాల్సినవి బోలేడన్నీ ఉన్నాయని, తెలుగులో కూడా ఆ స్థాయిలో రచయితలు రావాలని వస్తున్నారు అని వాళ్ళని పాఠకులు, పెద్ద వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని యువ రచయితలు గట్టిగా ఆకాంక్షింస్తున్నారు.
బ్లూ స్కార్ఫ్
జీవిత శకలాల సమాహారమే బ్లూ స్కార్ఫ్.విద్యార్థి ఉద్యమాన్ని చిత్రించిన మొదటి తెలుగు నవల. అత్యంత గాయపరిచిన విద్యుదుద్యమంతో మూడేసి విద్యార్థులు ఉద్యమాన్ని నడిపిస్తూ రైతు జీవితాన్ని పునాదిగా చేసుకొని సరళమైన భాషతో ప్రేమని రుచి చూపించిన నూతన నవల. అనుభూతిని, ఆవేశాన్ని, దుఃఖాన్ని, పెనుగులాటను, గాయాన్ని ,గేయాన్ని, పోరాటాన్నిదోపిడిని వాక్యంగా కదిలించిన ఆధునిక నవల.
నేను చదివిన నవలలలో విద్యార్థి ఉద్యమాన్ని ఆధారంగా చదివినవి అన్నీ రష్యా ,చైనా నవలలు మాత్రమే. కానీ మనదైన నేల , మనదైన పోరాటాన్ని చిత్రించిన నవలలు తెలుగులో కనపడకపోవడంతో విద్యుత్ ఉద్యమాన్ని రికార్డ్ చేశాను.నవల ప్రక్రియకు చదివించే గుణం ఉంటుంది.ఈ ప్రక్రియను ఎన్నికోవడానికి కారణం కూడా నవలికరిస్తే త్వరగా పాఠకులకి చేరుతుందని.
- విప్లవ్ కుమార్
మై నేమ్ ఈజ్ చిరంజీవి
''దిగువ మధ్య తరగతి పల్లెటూరు పిల్లాడి సహజమైన కథ. వాస్తవ జీవితాన్ని అద్దం పట్టినట్టు చూపించే ఒక యువకుడి జీవితగాథ. చెప్పకూడదని కప్పి దాచేసే విషయాల్ని నిక్కచ్చిగా చెప్పి సాధారణంగా మాట్లాడుకున్నట్టే రహస్యాల్ని బయట పెట్టిన చదివించ దగ్గ నవల.తను అనుభవించిన జీవితాన్ని తానే రాసు కున్న ఆత్మకథగా కాకుండా జాగ్రత్త పడుతూ తనలాంటి యువకుల బయో గ్రాఫిని సరికొత్త కోణంలో చూపిం చాడు. ఇది యదార్ధానికి కల్పనని, కల్పనకి యదార్ధాన్నీ జోడించి దంచిన అల్లంవెల్లుల్లి పేస్ట్. రెండింటిని వేరుచెయ్యలేం.
ఇది.
చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే అల వాటుతో ఏదైనా రాయా లనే సరదా స్కూల్ లో మొదలైంది. పిచ్చి పిచ్చి రాతల్ని రాస్తూ కొట్టేసేవాన్ని రాయాలంటే అధ్యయనం అవసమని తెల్సింది. ఇంగ్లీష్ లిటరేచర్ లో క్లాసిక్ అనదగ్గ పుస్తకాల్ని చదివాను. ఒకానొక రాత్రి నిద్రపట్టని వేళా ఆలోచనల్లో పడి మొదలెట్టిన దాన్ని ఇప్పుడు పుస్తకంగా చూసుకున్న.
- ప్రసాద్ సూరి
భూమి పతనం
ఇరవై ఏండ్ల పిలగాడు నవల రాయాలి అంటే ఏం రాస్తాడు..?తన ఇరవై ఏళ్ళలోని అనుభవ జీవితాన్నే రాస్తాడు. ఆ అనుభవం , వేదన నుండి పుట్టిన దానికి అక్షరరూపం ఈ నవల. వ్యవసాయం ఈ దేశపు గ్రామీణ సంస్కతి దాన్ని పరాయీకరణ చేస్తున్న మత సంస్కతి ఈ నవల నేపథ్యం. దింట్లో భూమి చుట్టూ ముడిపడిన సన్నకారు రైతు గోస తనదైన కోణంలో కన్పిస్తుంది. కొన్ని చోట్ల ఏడిపించిన వాస్తవ స్థితిగతులతో మంచి ఫీల్‌ని అందిస్తుంది.
నా ఇరవై ఏండ్ల జీవిత అనుభవాన్ని ఒకే కాన్వాసు పై మొత్తం ఆలోచనల్ని ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి అనిపించి , నన్ను నేను ఆవిష్కరించు కోవడానికి నా అమాయకత్వాన్ని , బాధని, ఆవేదనను చూపడానికి నవల ప్రక్రియ సరైనదని భావించాను.
- గూండ్ల వెంకట నారాయణ
శ్రీ బాలాజీ టాకీస్ (ప్రేమప్రబంధం)
శ్రీ బాలాజీ టాకీస్ నవల 1990లలో, సినిమా థియేటర్ నేపథ్యంలో జరిగే ప్రేమకథ .మూడు ప్రేమకథలు మూడు నదుల్లా కలిసి ప్రవహిస్తాయి. తొంభైలలో యూత్‌కి అద్దం పడుతుంది. అప్పటి సినిమాలు, సాహిత్యం, సంగీతం, రాజకీయా, ఆర్థిక పరిస్థితులు ప్రతిబింబిస్థాయి.ప్రపంచమంతా గ్లోబలైజేషన్ అవుతున్న కాలం. అమెరికా డాలర్ల కల కనే యూత్ ఒకవైపు, ఉద్యమాల వైపు దూసుకుపోతున్న యూత్ మరో వైపు, ఈ రెండింటికి చెడ్డ రెవడిలా మిగిలిపోయిన 90శాతం యువత ఇంకోవైపు.
ఇదే కథే. శ్రీ బాలాజీ టాకీస్ నమ్ముకుని బతికే కొంతమంది మనుషులు వుంటారు.ధియేటర్ ఓనర్ నుండి సినిమా థియేటర్ ని ఆధారం చేసుకుని బతికే ఒక ప్రపంచమే బతికేస్తుంటుంది దింట్లో. ఇది ప్రేమప్రబంధం. ఇందులో ప్రేయసి, ప్రియులు వుంటారు. వాళ్ళ ప్రేమ,ఎడబాటు, విరహం, రొమాన్స్ ఉంటుంది. అంతకు మించి కవిత్వం, నేపధ్య సంగీతం ఉంటుంది. పాత, కొత్త సినిమా పాటలు నవలంతా వినిపిస్తూ ఉంటాయి. సినిమా థియేటర్ నేపథ్యం వచ్చిన మొదటి నవల శ్రీ బాలాజీ టాకీస్.
నేను చదువుకుంటూ సినిమా థియేటర్లో బుకింగ్ క్లర్క్‌గా వర్క్ చేస్తూ, సినిమా డైరెక్టర్ అవ్వాలని ఒక లక్ష్యంతో హైదరాబాద్‌కి వచ్చిన వాడ్ని. ఒక్కసారిగా కరోనా టైంలో థియేటర్స్ మూత పడేసరికి, షూటింగ్స్ ఆగిపోయేసరి నాకు ఎలాబతకాలి?అని భయం పట్టుకుంది. ఆస్తులు లేవు, డైరెక్టర్‌గా సక్సెస్ కాలేదు. కష్ణానగర్‌లో సినిమానే ఆధారం చేసుకుని బతుకుతున్న కుటుంబం. చాలా భయం వేసింది. కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుందామా అని ఆలోచనల్లో కూడా పడ్డాం. అంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఆ డిప్రెషన్లోనుంచి రాసుకున్న నవల ఇది.
- కరణ్ గోపిని
బాలాజీ -యోధ
యోధ నవల రమ్య అనే నిండు గర్భిణీ అయిన ఒకమ్మాయి కథ. సర్వైవల్, అడ్వాంచరస్ ఫిక్షన్. యోధ అనగానే అందరూ ఒక మగ యోధుడి కథేమో అను కుంటారు. ప్రెగెన్సీ ని దాటి శిశువుకి జన్మని ఇచ్చిన ప్రతి స్త్రీ యోధురాలే. ఆడవాళ్ల శక్తి, మగవాళ్ళ శక్తికి ఏ మాత్రం తీసిపోరని చెప్పే సరికొత్త నవల యోధ. శక్తిని ప్రదర్శించాల్సిన సమయంలో వాళ్ళ శక్తి బయటపడుతుంది అని చెప్పే ప్రయత్నమే ఈ నవల కథాంశం. ఈ పాయింట్స్‌ని సర్వైవల్ అండ్ అడ్వాంచర్ రూపంలో హిమాలయ బ్యాక్‌గ్రౌండ్‌లో చెప్పారు. ఒక ఆధునిక పురుషుడి ఆలోచనల్లో స్త్రీ ఎంత ఇన్స్పిరేషన్గా ఉందొ చెప్పే నవల.
చిన్నప్పటి నుంచి షార్ట్ స్టోరీస్ , నవలలు చదివేవాన్ని ఎప్పటి నుండో నేను కూడా నవల రాస్తే బావుండు అనుకునేవాన్ని. యోధాతో నా కల సాకారమైంది. ఇప్పటి స్మార్ట్ ఫోన్ కాలంలో నవలలు చదివే వాళ్ళు ఉంటారా అనుకున్నాను.కానీ మనసుపెట్టి రాస్తే తప్పకుండా చదువుతారు అని ఒక నమ్మకం.
- బాలాజీ ప్రసాద్
పొత్తి
తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకొని వొచ్చిన తొలి నవల పొత్తి. తెలంగాణ ప్రాంత గ్రామీణ విద్యార్థి ఉద్యమ నాయకుల పాత్రల్ని చిత్రించింది ఈ నవల. శంకర్ , గంగల పాత్రలతో వొక విధమైన సరళితో చదివించదగినదిగా , ఆకట్టుకొనే విధంగా ఉంటుంది.పల్లీయా జీవన విధానం ,ఉస్మానియా విద్యార్థులు పాత్రల మేళవింపు లో తెలంగాణ సాధనని తెలియజేస్తూ తెలంగాణ భాషని పట్టిచూపిస్తూ నవల నడుస్తుంది. కుల దూరహంకారాన్ని నిరసిస్తూ సందర్బొ చితంగా పాటలు కవిత్వాత్మక వచనం , విశేషమైన ప్రతీకలు ఉండడం దీని ప్రత్యేకత. పశువుల పట్ల పల్లెటూరు మనుషులకు ఉన్న అనుబంధాన్ని సిబ్బి అల్లినట్టు అల్లుకపోయింది నవల ఇది.
ఒకప్పటి నవలలు వందల పేజీల కొద్దీ నవలలు అప్పటి పాఠకులు చదివే వారు. ఈ తరానికి నవల పేజీల సండలింపు అవసరం అనిపించింది . కథల నుండి ప్రారంభించిన సాహిత్యాన్ని చదువుతూ ఉంటే నవలలో ఎదో తెలియని లోటు కన్పించింది .నవలా సాహిత్యంలో ఒక నూతన ఒరవడి సష్టించాలని నవల ప్రక్రియను ఎంచుకున్న. గ్రామీణ భాషా అంతరిస్తుంది దాన్ని కాపాడుతూ ఈ నవలల గుండా విస్తతంగా వ్యాప్తి చెయ్యవొచ్చు . సామాజిక ,సాంస్కతిక, చారిత్రక, భాషా నుడి కారాలను చూపెట్టడానికి నాకు అనుకూలమైన పక్రియ నవల.
- నర్రా ప్రవీణ్ రెడ్డి
- పేర్ల రాము 9642570294