Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్ను మూస్తే రెప్పలమాటున
మనోహర దశ్యం ఆవిష్కాకారమౌతుంది
మస్తిష్కం సప్తవర్ణ శోభితమౌతుంది
ఆలోచనలు
పచ్చికలో లేడిపిల్లలై గెంతులేస్తాయి
పూదోటలో సీతాకోకచిలుకలై
వన్నెచిన్నెల హొయలు ఒలకబోస్తాయి
ప్రతిదశ్యం మధుర భావనా తరంగమై
నీలి ఆకసాన తేలి యాడుతుంది
రూపం కంటిపాపలో కదలాడుతుంది
ఒక్కొక్కటిగా జ్ఞాపకాలన్ని తేనెల ఊటలేస్తాయి
ఎడబాటు కన్నీటిసుడుల్ని స్రవిస్తుంది
నీతోడు కోసం మనసు వరదగూడేసి ఎదురుచూస్తుంది
నీలిమబ్బులపై రెక్కలార్చే కొంగలబారులు
నన్ను చూసి జాలిపడతాయి
గొంతు మూగబోయి మాటపెగలదు
గుండె గడ్డకట్టుకుపోయి ఓపలేని భారమౌతుంది
నీ ఓదార్పు కోసం నలుదిక్కులా చూస్తాను
నిరాశ నిశీధి వలె కమ్ముకుంటుంది
కళ్ళు కరిమబ్బులై వర్షిస్తాయి
వత్సరానికొక వసంతం వలె
నీ సమక్షం ఆనందపు గవాక్షమౌతుంది
కలిసిన క్షణం తనువు పూతీవై పూస్తుంది
పెదవులు మధువులు కురుస్తాయి
నీ స్పర్శకు మేను నందనవనమౌతుంది
అల్లుకున్న తనువులు
చిక్కుబడ్డ చూపులు
పెనవేసుకున్న మనసులు
ఎంతకీ విడివడ మంటాయి
మరల ఎప్పటికో ఈ మధుర క్షణాలని
మనసు నిట్టూరుస్తుంది
- టి. హరికష్ణ, 9494037288