Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కత్తులకు పూలు పూస్తే బాగుండు...!
చేతుల్లో దండలై నిలిచేవి...
మెడలో హారాలై పడేవి
కలాల... అక్షరాలు అవసరమైనపుడు
విదిలిస్తే బావుణ్ణు...
దారంట పూలు పరిచేవి... బాట నడిపేవి
చెవుల తూట్లు పొడుస్తూ...
కోటలు దాటే బదులు...
నాలుగు మంచిమాటలు..
ఇపుడే ఉంటే బావున్ననిపిస్తుంది.
చేతులు కలిపి...వందలు వేలుగా...
రోడ్లపైన గుంపులా చూడాలనుంది...
'మనమందరం ఒక్కటే'
అన్న అరుపులు వినాలని ఉంది.
భయమెరుగక... పిల్ల-పాప... జనులంతా
బతుకగా చాడాలని ఉంది.
అందరిహితులైన ఎందరినో చూసి
ఆ హితులందరు సమ్మోహితులైపోతే...
బాగుండనిపిస్తుంది.
స్వర్గం ఈ నేలకు దిగి
ఇక్కడనే ఉంటానంటే... వినాలని ఉంది.
అసలు భూవినంతా స్వర్గంగా చూడాలని ఉంది.
- అనుముల ప్రభాకరాచారి
సెల్ : 9676549963