Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మురిపించే నీ మువ్వల సవ్వడి విన్న
ఆ వాయువుదెంత అదృష్టమో కదా..!
ఆ శబ్దం విన్నాకనేనేమో
సంగీతం అనే పదం జన్మించింది
నీ పాదం తాకి పులకరిస్తున్న
భూమి ఎంత పుణ్యం చేసుకుందో కదా..!
ప్రతీక్షణం ఆ స్పర్శతోనే
చిరునవ్వుతో, ఓపికగా అందరినీ ఆదరిస్తుంది
అందమైన నీ నవ్వును చూసిన
ఆ చెట్టుది నీతో ఏ జన్మ బంధమో కదా..!
నరికేస్తున్నా, నవ్వుతూ నేనున్నానని
మళ్ళీ చిగురిస్తుంది
నీ నవ్వులాగా..!
పలికిన పదం,
రాసిన అక్షరం,
వేసిన అడుగు,
నడిచిన దారి,
ఆడిన ఆట,
పాడన పాట,
గీసిన గీత,
సాధించిన విజయం,
ఇవన్నీ కనులార చూసి ఉప్పొంగిపోతున్న
ఆ మాతృమూర్తి క్షణక్షణం జన్మిస్తూనే ఉంది...
నీ పెదవి పలికిన పదబంధానికి
మరణం లేదని అంటుంటే విన్నా కానీ, పలకలేని,
పలకని బంధం నాలో కలిసి,
అవరోధమైనప్పుడే అర్థమైంది..!
- నిత్య లడె