Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నీ చురుకైన చూపులతో
నా ఎదలో అలలను రేపావు
నీవు రువ్విన పలచని నవ్వులతో
నా ఊహలకు రెక్కలు తొడిగావు
నీ కాలిమువ్వల సవ్వడులతో
నవ జగతిలోకి నడిపించావు
రోజంతా నీ పేరే తలచుకుంటూ
నాలో నీ రూపం చూసుకుంటూ
మౌన రాగాలను ఆలపిస్తున్నాను
నీ మాటల గుర్తులను వెతుకుంటూ
నీవు చిలికిన ప్రేమ చినుకులను
ఏరుకుంటూ
నా మదినిండా నింపుకుంటున్నాను
నీవు ఎండ మావిలా మిగిలిపోకు
నా ఎద కొలనులో లతై వికసించు
నీవు మోడు బారిన చెట్టులా ఉండిపోకు
నా తనువు మైదానంలో మయూరం లా నాట్యమాడుకో
చింతలన్నీ మరిచిపోయి
నాతో చిరకాలం ఉండిపో
- తాటిపాముల రమేష్
7981566031