Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు కన్నడ , హిందీ , తమిళ్ , ఆంగ్ల అన్ని భాషల్లో కలిపి సుమారు 250కి పైగా లఘుచిత్రాలకి సంగీత దర్శకుడిగా పని చేసారు. 2012 నుంచి ఇప్పటికి వరకు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ షార్ట్ ఫిలిం జర్నీలో 10 వసంతాలు పూర్తి చేసుకున్నారు.
ఆంధ్ర యూనివర్సిటీ లో డిగ్రీ పూర్తి అయినా వెంటనే 2005లో హైదరాబాద్ వచ్చిన పీవీఆర్ రాజా మొదట సంగీతం టీచర్‌గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. సంగీత దర్శకులు ఆర్.పీ. పట్నాయక్ పర్యవేక్షణ సహకారంతో 2011 నుంచి లఘుచిత్రాలకి పీవీఆర్ రాజా సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. 2012 నుంచి ఇప్పటి వరకు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్, ఆంగ్ల అన్ని భాషల్లో కలిపి సుమారు 250కి పైగా లఘుచిత్రాలకి సంగీత దర్శకుడిగా పని చేసారు. 2012 నుంచి ఇప్పటికి వరకు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ షార్ట్ ఫిలిం జర్నీలో 10 వసంతాలు పూర్తి చేసుకున్నారు. తెలుగు లఘుచిత్ర పరిశ్రమలో చేసిన కషికి గాను '' షార్ట్ ఫిల్మ్స్ మాస్ట్రో'' గా పేరుపొందారు.
సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు
2014లో డైరెక్టర్ పూరీజగన్నాధ్ సొంత మూవీ బ్యానర్ వైష్ణో మీడియా ప్రొడక్షన్లో వచ్చిన '' ఆర్య 3'' లఘు చిత్రానికి పీవీఆర్ రాజా సంగీతం అందించారు. 2016లో నటి రోజా సెల్వమణి స్వయంగా నిర్మించిన ''1 అవర్ '' లఘుచిత్రానికి పీవీఆర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
2020లో అన్నపూర్ణ స్టూడియోస్ వారి అన్నపూర్ణ కాలేజీ ఆఫ్ ఫిలిం అండ్ మీడియా గ్రాండ్ ఫెస్టివల్లో ఆహా ఓటీటీ కోసం ఎంపికయిన ' ఆత్మ రామ ఆనంద రమణ' చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు.
రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్ స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో పీవీఆర్ రాజా 15కు పైగా చిత్రాలకి సంగీత సమకూర్చారు. సంగీత ప్రయాణంలో తన వందవ చిత్ర సంగీతాన్ని షార్ట్ ఫిలిమ్స్‌లో మంచి గుర్తింపు పొందిన ' ఎంఆర్ ప్రొడక్షన్స్' నిర్మించిన 'ఒక్క క్షణం' షార్ట్ ఫిలింకి అందించారు. మిట్టి బ్యాక్ టూ రూట్స్ చిత్రంతో హిందీ ప్రేక్షకులకి కూడా దగ్గర అయ్యారు.
అందుకున్న అవార్డులు
- 2007 చెన్నైలో ఎ. ఆర్. రెహమాన్ నిర్వహించిన హూ.. లలల్లా .. మ్యూజిక్ బ్యాండ్ హంట్‌లో పాల్గొని షాలోమ్స్ బ్యాండ్ తరుపున టాప్ 18లో నిలిచారు.
- 2011 ప్రతి ఏటా భారత ప్రభుత్వం నిర్వహించే జాతీయ స్థాయి యువజనోత్స పోటీలలో ఉమ్మడి సమైక్య ఆంధ్ర ప్రదేశ్ తరుపున ప్రధమ స్థానంలో నిలిచి, గిటారు విభాగంలో ఉదయపూర్ రాజస్థాన్‌లో జరిగిన పోటీలకి జాతీయ స్థాయికి ఎంపిక అయ్యారు.
- 2013 హైదరాబాద్ టైమ్స్ ఫ్రెష్ పేస్ 2013 కంపిటిషన్స్లో ఫైనల్స్‌కి ఎంపిక అయ్యారు.
- 2017 తానా ఇంటర్నేషనల్ తెలుగు షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌ల్లో ఉత్తమ సంగీత దర్శకుడిగా ఇట్లు మీ లైలా చిత్రానికి అవార్డు తీసుకున్నారు.
- 2020 సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు సైమా షార్ట్ ఫిలిం అవార్డ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీలో అంతరార్ధం చిత్రానికి నామినీగా ఉన్నారు.