Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కులాల పేర్ల తో భవనాలు
గిరిజనుల పేర రిజర్వేషన్లు
ఆసరా పథకం తో ఆకర్షణలు
అన్ని గాలానికి కుచ్చే ఎరలు ,మాంసపు, ముద్దలు
ఓటర్ చేపలను పట్టి బుట్టలో వేసుకొనుటకు
విసిరిన పన్నాగాలు
ప్రజలకు మసి బూసి మారేడు కాయ చేసే డ్రామాలు
గంగిరెద్దులా తలలు ఊపించే మాటల మంత్రాలు
మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె ఎక్కడిది !
ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసే హక్కు ఎక్కడిది !
నజరానాలు ,తాయిలాలు ఇవ్వడానికి నవాబుల జాగీరా ? ఆస్తులు అమ్మి కోట్లు కుమ్మరించుతున్నారా !
లేక ప్రజల సొమ్ము కాజేసి జేబులు నింపుకొంటున్నారా !
ఖర్చులు పెంచి ఖజానా ఖాళీ చేసే ట్రిక్కు లా !
తాతలు సంపాదించిన రిజర్వేషన్ లా పెంచడానికి !
పాలాభిషేకాలు పాధాభి షేకాలు చేసే వారే
వల్లంకి తాళం వేసి వంత పాడిన వారే కిన్నెర మొగిలయ్య వీణలు మీటి జన పదం పలికించిన వారే
అధికార పీఠం నుండి ఉన్న పళంగా ఊడ పీకే వారే
గొర్రెల మంద కు తోడెలును కాపలా పెట్టిన వారే మరి !
పాద యాత్రలు చేసినా ,దొంగే దొర అని దండోరా వేసినా పూర్ణకుంభం తో మేళ తాళాలతో స్వాగతం పలికినా ప్రజలు మూకుమ్మడిగా తిరుగ బడి చేయ బోయే లంకా దహనం తప్పదు మరి !
నీతికి పట్టాభిషేకం ఎప్పుడు ! నిజాయితీకి సన్మానాలు
చేసే దెప్పుడు ,! ఒకే పాదం పై ఎవరెస్టు శిఖరమంతా
బరువును మోయించుతున్న రా జా కీ యం
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న నా ట కీ యం
- పూసాల సత్యనారాయణ, 9000792400