Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాలానికి అలవాటే!
వసంతాన్ని గుర్తించేలోపు వర్షాన్ని
హేమంతం ఊహించేలోపు గ్రీష్మాన్ని!
జననంతో అశాంతిని
మరణంతో స్వాంతనను!
రేణువంత విత్తులో మహావృక్షాన్ని
రెప్పపాటు క్షణంలో మహాప్రళయాన్ని
దర్శిస్తుంది!
అంబుది అంత నిరాశలో
ఆకాశమంత ఆశను మధిస్తుంది!
చిమ్మటి చీకటి అంబరంలో
మెరుపు తారల్ని జల్లి!
పిండి వెన్నెల సోబగు తెచ్చిన
చంద్రుడ్ని అమావాశ్య చెరలో తోస్తుంది!
తూర్పుసంద్రంలో పురుడోసుకున్న
సూరీడుని పడమటికొండల్లో ఖననం చేస్తుంది!
ఆశ పూలు కప్పి,
అడియాశలు ముళ్ళు పరచి
ఆహ్వనాలు పలుకుతుంది!
వరమిచ్చిన సమయంలోనే
శాపమున్న తరుణం దాస్తుంది!
తొందరపడి నిందించకు!
స్థిరం లేదని అనుకోకు!
కరువొచ్చిన కాలం వరాలను,
శాపాలను అందరికీ తిప్పి, తిప్పి
సద్దుతోంది.
ఎల్లకాలం ఒక్కరికే దక్కకుండా
సమన్యాయం చూపుతోంది.
ఓ చేత్తో ఇచ్చి, ఇంకో చేత్తో
లాగుకోవటం దానికి అలవాటే!
మరలి వచ్చి, ఏదైనా ఇచ్చి
ఏమైనా చేయటం కాలానికి పరిపాటే!
- ఉషారం, 9553875577