Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూల పండు గొచ్చింది
సంబరాల సందళ్ళు తెచ్చింది
తొమ్మిది రోజుల పండుగ
జరుపుతారు జనం ఎంతో మెండుగా గౌరమ్మను కొలుస్తారు గుండెల నిండుగా
సంసార సాగరం లో చెలరేగిన
అలల తరంగాలకు ఆనకట్ట వేసుకొని
కాలం చేసిన గాయాలకు లేపనాలు రాసుకొని
కన్నీళ్ళ సుడులను కనురెప్పల మాటునే దాచుకొని
కొంగు ముడి కష్టాలను కాసేపు దించుకొని
అమ్మ ఒడిలో పసిపిల్ల లా ఒదిగిపోతున్రు
నాన్న స్పర్శ కొలనులో హంస లా
ఆనందంగా మగువలు సేద తీరుతున్రు
పూలన్నీ రాసులు పోసుకొని
మనసంతా మందిరం చేసుకొని
వరసకో రకం పుష్పాలను కూర్చి
హరివిల్లు లా బతుకమ్మ ను పేర్చుతున్రు
భక్తితో గౌరమ్మను ఎదలో కొలస్తున్రు
పల్లె పదాలకు జీవం పోసి
కైతికాలకు ప్రాణం పోసి
కొమ్మ మీద కోయిలలై గొంతెత్తి పాడే
వారు మంచి ప్లే బ్యాక్ సింగర్స్ పాటకు పాదాల సవ్వడులను జతచేసే
వారు మంచి కొరియోగ్రాఫర్స్
వారు సరిగమలన్నీ నాలుక పైనే సరిగ్గా
పలికించే లతామంగేష్కర్ లు
అతివల అందాలను చూసి
పుడమి తల్లి మురిపెంగా మురిసిపోతుంది
ప్రకృతి తల్లి పరవశించి పులకరిస్తోంది
భగ భగ మండే భానుడు సైతం డ్యూటీ దిగి వచ్చి రాత్రి పూట కలర్ ఫుల్ కాంతులతో మగువల అందాలతో పోటీపడుతుండు
చుక్కల రాజు సైతం వనితల అందాలకు వడలిపోయి మబ్బుల చాటుకు చటుక్కున జారుతుండు
- తాటిపాముల రమేష్, 7981566031