Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమా అంటే అతనికి ప్రాణం..
నటనంటే అతనికి ఊపిరి. మెగా ఫ్యామిలీని ఆదర్శంగా తీసుకుని ఎన్నో అద్భుతమైన చిత్రాలకు పని చేశాడు. VFXగా అత్తారింటికి దారేది?, పిల్లా నువు లేని జీవితం, ఎవడు? మొ.సినిమాలకు పనిచేసి తన సత్తా చూపించాడు. అందరూ మెచ్చే పాత్రలను పోషించాలని అహర్నిశలు శ్రమిస్తున్న
సునీల్ చరణ్‌తో ఈ ఆదివారం మన జోష్...
- మీ జీవిత నేపథ్యం గురించి చెప్పండి?
నా పేరు సునీల్ చరణ్ ..పుట్టి పెరిగింది అంత వైజాగ్ సిటీ లోనే , మాది మిడిల్ క్లాస్ కుటుంబం ..మా నాన్న పేరు విజరు కుమార్. అమ్మ పేరు ఈశ్వరమ్మ. నాన్న గవర్నమెంట్ ఉద్యోగి , అమ్మ హౌస్ వైఫ్ , సిస్టర్ కావ్య కి రీసెంట్ గా పెళ్లి అయ్యింది. NRI సంబంధం .మా బావ గారు నాకు మంచి సపోర్ట్ గా నిలుస్తారు..నేను వైజాగ్ లోనే అమర్ కాన్సెప్ట్ స్కూల్ లో చదువుకున్నాను. ఎన్.ఆర్.ఐ కాలేజ్ లో ఇంటర్, పైద్య డిగ్రీ కళాశాలలో బి.ఎస్సీ పూర్తి చేశా. 2013లో VFX ట్రైనింగ్ కూడా పూర్తి చేశాను.
8 మీకు సినిమారంగంలోకి రావాలని ఎందుకనిపించింది?
మా నాన్న గారు, చిరంజీవి గారుకి DIE HARD FAN కావడం వలన చిన్నతనం నుండి చిరంజీవి గారి సినిమా లు చూస్తూ పెరిగాను ..దాని ప్రభావం వలన సినిమాలు లో యాక్టర్ కావాలని ఆసక్తి పెరిగింది కానీ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం వలన ఎలాగైనా సినిమాలో ఉండాలని ఏదైనా వర్క్ చేయాలి అని pixelloid సంస్థ లో VFX ట్రైనింగ్ సంవత్సరాలు తీసుకొన్నాను. ఆ తరువాత కెమెరామన్ గంగతో రాంబాబు, ఎవడు, అత్తరింటికి దారేది, పిల్లా నువ్వు లేని జీవితం వంటి మెగా ఫ్యామిలీ మూవీస్‌కి వర్క్ చేయడం జరిగింది. తరువాత ఆ అనుభవంతో 19 సంవత్సరాలా వయస్సు లోనే వైజాగ్‌లో LEO9VFX స్టూడియో ప్రారంభించాను
- ఎలాంటి నేపథ్యమున్న కథలంటే మీకు ఇష్టం?
రంగస్థలం లాంటి సహజత్వానికి దగ్గిరగా వున్నా సినిమా
కథలు అంటే ఇష్టం ..
- మీకు రోల్ మోడల్ ఎవరు?
మెగా ఫ్యామిలీ
- మీరు సినిమారంగంలోకి రావడానికి మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉంది?
ఎవరి ఇంట్లో అయినా సినిమా రంగం అంటే భయంతో వద్దు అంటారు అలాగే మా ఇంట్లో కూడా మొదట్లో వద్దు అన్నారు కానీ నా టాలెంట్ నిరూపించుకున్న తరువాత వాళ్లే నాకు గైడ్‌గా నిలబడ్డారు.ఇప్పటికి కూడా నేను ఏ పని చేసిన వారి ప్రోత్సాహం ఉంటుంది
- ఇది మీ జీవితంలో మరిచిపోలేని బెస్ట్ కాంప్లిమెంట్ అని మీకు ఎప్పుడనిపించింది?
నేను సినిమా ఇండిస్టీలో కొంత పేరు తెచ్చుకున్న తరువాత నేను ఎంతో ఇష్టపడ్డ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా నాగబాబు గారు నీకు నేను వున్నా చరణ్ అని భరోసా ఇచ్చినపుడు ...ఎంతో మంది స్టార్ హీరోలను వెండి తెరకు పరిచయం చేసిన స్టార్ మేకర్ సత్యానంద్‌గారు నేను చేసిన వర్క్ చూసిన తరువాత ఒక పెద్ద టెక్నిషన్కు వున్న క్వాలిటీస్ ఇంత చిన్న వయసులో నీకు వున్నాయి అని చెప్పి నా వర్క్ ఇప్పుడు నుండి నువ్వు చేయాలి అని నాకు చెప్పడం నాకు చాల ఆనందం కలిగించింది. యాక్టర్ ప్రసన్న కుమార్ గారు ఒక సొంత కొడుకు లాగా చూసుకుంటారు ఎప్పుడూ ఏ కష్టం వచ్చిన, నేను వున్న నాన్న అని సపోర్ట్‌గా నిలబడతారు
- మీరు పొందిన అవార్డుల గురించి చెప్పండి?
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం - వికీపీడియాగారి చేతుల మీదగా తీసుకున్న అవార్డు నేషనల్ వైడ్ కాంపిటీ షన్ వర్డ్స్‌లో బెస్ట్ Vఖీశకి అవార్డు వచ్చింది అలాగే పరుచూరి గారి చేతుల మీదగా తీసుకున్న అవార్డు హీరో శ్రీకాంత్ గారి చేతుల మీదగా అవార్డు తీసుకు న్నాను రైటర్ అండ్ సింగర్ చంద్ర బోస్ చేతుల మీదగ ఇంకో అవార్డు తీసుకున్నాను యాక్టర్ అలీ, సోలో మూవీ ప్రొడ్యూసర్‌తో ఇలా ఎనో అవార్డ్స్ పొందాను
- మీ రాబోయే ప్రాజెక్ట్స్ గురించి చెబుతారా?
ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో 5, మూవీస్ ఆర్టిస్ట్‌గా 2 మూవీస్ చేస్తున్నాను
- సినిమా అంటే ఏమిటి..అని అడిగితే ఒక్క మాటలో మీరేం చెబుతారు?
సినిమా అంటే నా ప్రాణం ఒక మాటలో చెప్పాలి అంటే ఇదే నా లైఫ్ .