Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆమె
కళ్ళనే చూశాను.
పక్కనే నీళ్లబాటిల్ తలతిప్ప కుండా
నన్నే గమనిస్తుంది
బెంచి మీది పుస్తకాలు ఉన్నట్టుండి కళ్ళుమూసుకున్నాయి
పెన్ను తెల్లకాగితం మీద
ఇందాక చూసిన కళ్ళనే గీస్తుంది.
కిటికిలోంచి వెన్నెల కాగితం
మీదకి రానే వొచ్చింది.
గది ఆమె కళ్ళ వెలుగులతో
చీకటిని ముక్కలుగా నరికేసింది.
ట్యూబ్ లైట్ వెలుగులన్నీ పలుచబారి పోయీ
నా లోపలి గదినంతా
పొద్దున దాకా అవే కళ్ళు వెలిగిస్తూనే ఉన్నాయి.
- పేర్ల రాము, 9642570294