Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హోం ఎఫైర్స్ విద్యా శాఖ డైరెక్టర్ మార్చేంగ్ వర్తింగ్
నవతెలంగాణ -సూర్యాపేట కలెక్టరేట్
జలశక్తి అభియాన్ పధకం ద్వారా చేపట్టిన వివిధ పనులల్లో మెరుగైన అభివృద్ధి కనబడుతుందని కేంద్ర హోం ఎఫైర్స్ విద్యా శాఖ డైరెక్టర్ మార్చింగ్ వర్తింగ్, రూర్కె సైయింటిస్ట్ ఆర్.కె నేమ అన్నారు. గురువారం మొదటి రోజు పర్యటనలో భాగంగా పెన్ పహాడ్ అనంతరం గ్రామంలో రైతు నిమ్మ వెంకట కష్ణయ్య మామిడి తోటలో ఉద్యాన శాఖ ద్వారా ఏర్పాటు చేసిన ఫామ్ పాండ్ పరిశీలించారు. వర్షపు నీరు నిల్వ తో చేపల పెంపకం ,మామిడి తోటకు డ్రిప్‌తో పుష్కలంగా నీరు అందుతుందన్నారు.జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఇప్పటికే జిల్లాలో ముందుకొచ్చిన రైతులకు 20 ఫామ్ పాండ్లు సబ్సిడీ ద్వారా రైతులకు ఏర్పాటు చేశామని వివరించారు. గ్రామంలో పల్లె ప్రగతి, నర్సరీ, వైకుంటాధమం పరిశీలించారు. గరిడేపల్లి మండలం గడ్డి పల్లిలో కషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి జలశక్తి పై విద్యార్థులతో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొని వర్షం నీటిని నివ్వ చేసి భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి రాకుండా ప్రతి ఒక్కరు కషి చేయాలని సూచించారు. అనంతరం భూసార పరీక్ష కేంద్రం, విత్తన తయారీ కేంద్రం, చేపల చెరువు, పట్టు పురుగుల కేంద్రం, జీవ ఎరువుల తయారీని పరిశీలించి కేంద్ర నిర్వాహకులను అభినందించారు. అనంతరం సూర్యాపేట దూరాజు పల్లిలో పట్టణ ప్రకతి వనం, అలాగే సద్దల చెరువును పరిశీలించి పర్యాటక స్థలంగా చేసి ఆదాయ వనరులు పెంచేందుకు ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. అంతకుముందు జలశక్తి అభియాన్ కింద నీటి సంరక్షణకై జిల్లాలో చేపట్టిన అన్ని అభివద్ధి పనులసై కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ టి. వినరు కష్ణా రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కేంద్ర బందం మాట్లాడుతూ జిల్లాలో జలశక్తి అభియాన్ ద్వారా చేపట్టిన పనులలో ఎంతో అభివద్ధి కనబడుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులను కేంద్ర బందం అభినందించారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి సంతప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, సిఈఓ సురేష్, పీడీ కిరణ్ కుమార్, డీఎఫ్ఓ ముఖుంధ రెడ్డి, డీపీఓ యాదయ్య, అధికారులు, ఎంపీడీఓ , తదితరులు పాల్గొన్నారు.