Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- యాదగిరి గుట్ట
హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు.యాదగిరిగుట్ట టౌన్ లో పనిచేస్తున్న కొబ్బరి కాయల హమాలీకార్మికుల సమస్యలపై ఆ సంఘం అద్వర్యంలో సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందన్నారు. నెలలో ప్రతి రోజు పనిచేస్తున్న కనీసం 10వేల రూపాయలు కూడా రావడం లేదని కానీ కుటుంబ నిర్వహణకు నెలకు 15వేలు ఖర్చు అవుతుందని, పిల్లల చదువు లకు,ఆరోగ్యానికి ఖర్చుల కోసం అప్పులు చేసి జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రోజు పని ఉంటుందనే బరోసా కూడా కార్మికులకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల కన్వీనర్ బబ్బూరి పోశెట్టి,కొబ్బరి కాయల హమాలి యూనియన్ అద్యక్షులు స్వామి, కార్యదర్శి వెంకటేశం,నాయకులు శ్రీశైలం,వెంకటేశం,రమేష్,శేఖర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.