Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాడి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మంగ నర్సిహుంలు
నవతెలంగాణ- ఆలేరురూరల్
పాల ఉత్పత్తులు యంత్రాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ వెంటనే ఉపసంహరించు కోవాలని తెలంగాణ పాడి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మంగ నరసింహులు డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పటేల్ గూడెం గ్రామంలో పాడి రైతు సంఘం సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడుతూ జీఎస్టీ పరిధిలోని ప్రిఫ్యాక్ అండ్ ప్రి లేబుల్డు పాల ఉత్పత్తులపై ఐదు శాతం పన్ను విధించాలని నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది పైన ఈ భారం పడుతుందన్నారు. డెయిరీ మిల్క్ కింగ్ మిషనరీ పాల ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే యంత్ర సామగ్రిపై ప్రస్తుతం 12 శాతం ఉన్న జీఎస్టీ 18 శాతానికి పెంచాలన్న నిర్ణయం దేశ వ్యాప్తంగా పాల ఉత్పత్తుల తయారీ పై ఆధారపడిన కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. వెంటనే జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు పిక్క గణేష్, మండల నాయకులు బండ శ్రీనివాస్ ,భాస్కర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.