Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ ఎఫెక్ట్
నవతెలంగాణ - గరిడేపల్లి
గడ్డిపల్లి గ్రామంలో నకిలీ వరి విత్తనాలు అమ్ముతున్నారని నవతెలంగాణ పత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మండల వ్యవసాయ అధికారి ప్రీతం కుమార్ గురువారం గడ్డిపల్లి గ్రామంలో తనిఖీ చేశారు. గడ్డిపల్లిలోని ఎర్రకుంటకు వెళ్లే రహదారి వెంట ఉన్న ఒక ఇంట్లో వరి విత్తనాలను సుమారు 150 సంచులు నిల్వ ఉంచగా వాటిని సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. వరి విత్తనాలను నాణ్యత పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించినట్టు తెలిపారు. ల్యాబ్ పరీక్షల అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.