Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల ఐలయ్య
నవతెలంగాణ -ఆత్మకూర్ఎం
రాష్ట్రంలోని సబ్బండ వర్గాలప్రజల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం మండలంలోని కూరెల్ల, పుల్లయిగూడెం, రాఘవపురం, నరసాపురం, దుప్పెల్లి, లింగరాజుపల్లి, పల్లెర్ల గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో గడపగడప తిరుగుతూ వరంగల్ రైతు డిక్లరేషన్ అంశాలను ప్రజలకు ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పిన కేసీఆర్ మండలంలో ఎక్కడా కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ ,ఎకరానికి 15 వేయిల రూపాయల పెట్టుబడి సాయం, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తుందన్నారు. గ్రామాల్లో ఆయన సమక్షంలో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్లో చేరారు. లింగరాజు పల్లి నరసాపురం దుప్పెల్లి గ్రామాల్లో బీర్ల ఫౌండేషన్ ద్వారా ఏర్పాటుచేసిన వాటర్ ఫిల్టర్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి ఎంపీపీ తండా మంగమ్మ శ్రీశైలం గౌడ్, జెడ్పీటీసీ నరేందర్ గుప్తా వైస్ ఎంపీపీ భాష బోయిన పద్మ పాపయ్య, పీఏసీఎస్ చైర్మెన్ జిల్లాల శేఖర్ రెడ్డి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు నగేష్ ,సర్పంచులు ఎర్ర గీత విటల్ రెడ్డి,మత్స్యగిరి, శోభారాణి, జామ యాదయ్య దయ్యాల రాజు ఎంపీటీసీలు సోలిపురం మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు, ఓబీసీ మండల అధ్యక్షులు బత్తిని ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.