Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
బుడిగ జంగాల కాలనీలోని ఇండ్లలోకి మురుగునీరు వచ్చి చేరుతుందని కాలనీవాసులు గురువారం పేర్కొన్నారు .రెండేండ్లుగా స్థానిక వార్డు కౌన్సిలర్లు ,మున్సిపల్ పురపాలక సంఘం చైర్మెన్్ శంకరయ్యకు సమస్యను వివరిస్తున్నప్పటికీ పరిష్కరించడం లేదని కాలనీలోని మహిళలు వాపోయారు .డ్రైనేజ్ విధానం సరిగా లేకపోవడంతో మురుగునీరు ఎక్కడపడితే అక్కడ నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. వర్షాకాలం మరింత ఇబ్బందులకు గురి అవుతున్నామన్నారు .విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీకి చెందిన నాయకులు కాలనీ పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బడుగు జహంగీర్ ,జంపాల దశరథ,తూర్పాటి అబ్బయ్య , రాజు ,కాలనీకి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.