Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరారీలో ఇద్దరు
- 25 గంజాయి ప్యాకెట్ల ,సుమారు రూ.12 లక్షలు , కారు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన ఎస్పీ రెమా రాజేశ్వరి
నవతెలంగాణ- నల్లగొండ
గంజాయి రవాణా అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి నిందితులనుండి 25 గంజాయి ప్యాకెట్ల (200 కిలోలు) గంజాయి, సుమారు రూ.12 లక్షలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. డీజీపీ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా , గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతో పాటు నిరంతర నిఘా లో బాగంగా శనివారం తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్, బందం, నకిరేకల్ పోలీసులు విశ్వసనీయ సమాచారంతో కేతపల్లి పీఎస్ పరిధిలోని ఎన్‌హెచ్ 65 లోని కొర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్ళే వీన 02 A్ 6130 నెంబరు గల వాహనం మారుతీసుజ్కీ కారును ఆపి తనిఖీ నిర్వహించారు. అందులో గంజాయి ఉన్నట్లు గమనించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న ముభిన్ షేక్‌కు తన పక్క గ్రామమైన చందన్ కుమార్ హరిజన్, పటాన్ షేక్‌లను పరిచయమయ్యారు. వారు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుండి గంజాయి తక్కువ ధరకు తీసుకొచ్చి ఎక్కువ ధరకు రాష్ట్రంలో అమ్మేందుకు తీసుకొస్తున్నారు. కొర్లపాడ్ టోల్ ప్లాజా వద్దకు రాగానే పోలీస్ తనిఖీ చేస్తుండగా గమనించిన చందన్ కుమార్ హరిజన్ , పఠాన్ షేక్ కారు దిగి పారిపోయారు. నిందితుడి వద్ద నుండి 25 గంజాయి పాకెట్లు మొత్తం 200 కిలోలు, కారు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారికి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మోగిలయ్య, నల్గొండ డీఎస్పీ నరసింహ రెడ్డి పర్యవేక్షణలో శాలిగౌరారం సీఐ రాగవరావు ఎస్సై అనిల్ రెడ్డి , సిబ్బంది , టాస్క్ ఫోర్స్ బందాన్ని అభినదించారు.