Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 గంటల నుంచి 11 గంటలకు పెరిగిన పని వేళలు
- 3 గంటలు ఎక్కువ పని చేసినా.. ఒకటే ఓటీ అలవెన్స్
- ఓటీ(ఓవర్ టైం) అలవెన్స్‌ల్లో కోత
- పెండింగ్‌లో రెండు పే స్కేల్స్, ఐదు డీఏలు
కార్మికులు ఉద్యోగులకు పని గంటలు పెంచి పని భారం మోపుతున్న ఆర్టీసీ యాజమాన్యం తీరుతో కార్మికులు, ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. ఓటీ (ఓవర్‌టైం) అలవెన్సులో కోత పెడుతూ కా ర్మికుల పొట్టకొడుతోంది. ఓటీ డబ్బులు తగ్గడంతో గతంతో పోలిస్తే ప్రస్తుతం జీతాలు తక్కువగా వస్తాయని, అయినా యాజమా న్యం కార్మికులను పట్టించుకోవడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. రెండు పే స్కేల్స్, ఐదు డీఏలు ఇవ్వక పోగా, తిరిగి ఇలా జీతాల్లో కోత పెట్టడంపై ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు. అయితే ఆర్టీసీలో యూనియన్లు యాక్టివ్‌గా లేకపోవడంతో ఉద్యోగులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ కార్మికులను యాజమాన్యం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని సిబ్బం ది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ- నల్లగొండ
ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీలో 2800 పైచిలుకు మంది కార్మికులు, ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది డ్రైవర్లు, కండక్టర్లే ఉన్నారు. అయితే మాములు రోజుల్లో ఎనిమిదిగంటలు పని చేయాల్సి ఉండగా.. దానికి మించి పని చేస్తే ఓటీలు చెల్లించేవారు. ఉద్యోగి బేసిక్ పేను బట్టి గంటల లెక్కన ఓటీ డబ్బులు ఇచ్చే వారు. ఓటీని ఫైనల్ చేసేందుకు బస్సులో డ్రైవర్ లేదా కండక్టర్‌కు 141 షీట్ ఇచ్చేవారు. కాగా ఇందులో ఏ రూట్లో వెళ్లారు? ఎన్ని స్టాపులు ఉన్నాయి? ఎన్ని గంటలు పని చేశారు? తదితర వివరాలు ఉండేవి. వాటిని బట్టి ఓటీ డబ్బులను చెల్లిస్తుండగా.. టీమ్స్ వచ్చాక కూడా ఈ షీట్ల విధానం కొనసాగడంతో కార్మికులు నష్ట పోవాల్సి వస్తుందని వాపోతున్నారు. నెలాఖరున షీట్లన్నీ లెక్క తీసి ఓటీలు ఫైనల్ చేయాల్సి ఉండ గా.. కండక్టర్లు లేదా డ్రైవర్లు సంతకం చేసిన తర్వాతే ఓటీలు కట్టించే వారు. కానీ ఇంత కాలంగా ఆర్టీసీ యజమాన్యం ఈ షీట్లను ఇవ్వడం మానేసిందని కా ర్మికులు ఆవేదన చెందుతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం ఈ షీట్లను మానేయడంతో, అధికారులు ఓటీలు తగ్గించి వేస్తున్నారని చెబుతున్నారు. మూడు గంటలు ఎక్కువ పని చేసినా.. ఒక గంట మాత్రమే చేసినట్లు రాస్తున్నారని పేర్కొంటున్నారు. దీంతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని అంటున్నారు. జిల్లాలో ఇలాంటి పరిస్థితితో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు తలలు పట్టుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
7డిపోల్లో 3వేల మంది కార్మికులు
ఇప్పటికి ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిధిలోని రీజినల్ మేనేజర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆర్టీసీలో 7 డిపోలున్నాయి. ఈ డిపోల పరిధిలో సుమారు 2,800 పైచిలుకు మంది కార్మికులు కండక్టర్లు, డ్రైవర్లు పని చేస్తున్నారు. అయితే వీరు గత నాలుగేళ్లుగా ప్రభుత్వం తమకు రా వాల్సిన పీఆర్సీ, ఐఆర్ కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వం సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను మాత్రం నేటికీ నేరవేర్చడం లేదని వాపోతున్నారు. ఇతర ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికుల పట్ల యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదంటున్నారు.
పెరిగిన పని గంటలు...
కొన్ని రోజుల క్రితం వరకు ఆర్టీసీలో ఉద్యోగులకు ఎనిమిది గంటల డ్యూటీలు ఉండేవి. ఈ మధ్య వివిధ కారణాలు చెబుతూ డ్యూటీ టైంను 11 గంటల వరకు పెంచారు. ఆ తర్వాత అదనంగా పని చేసిన గంటల కు మాత్రమే ఓటీ లెక్కగట్టి ఇస్తున్నారు. దీంతో పాటు లాంగ్రూట్లో ఒక్క ట్రిప్ వెళ్లి వస్తే తెల్లవారు సెలవు ఉండేది. రెండు రోజుల్లో మూడు ట్రిప్పులు పూర్తి చేస్తేనే మరునాడు సెలవు ఇస్తున్నారు. కాగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే పీఆర్సీని అమలు చేస్తున్న ఈ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు మాత్రం ఇప్పటికీ పీఆర్సీ పత్తాలేదని అంటున్నారు. సంస్థలో రెండు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. 2015తో పాటు 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి పీఆర్సీలు అమలు కావాల్సి ఉండగా, నాలుగు సంవత్సరాలు దాటినా నేటికీ పీఆర్సీ అమలు కావడం లేదని దిగులు చెందుతున్నారు. ఫిట్మెంట్ ప్రకటించక పోవడంతో సమ్మె చేస్తామంటూ 2018లో ఆర్టీసీ యూనియన్లు హెచ్చరించారు. అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతత్వంలోని ఏడుగురు సభ్యుల మంత్రుల కమిటీ యూనియన్ నేతలతో చర్చించింది. 16శాతం ఐఆర్‌ను ప్రకటించింది. అయితే పీఆర్సీ మాత్రం రాలేదు. 2013 నాటి పీఆర్సీ బాండ్ల డబ్బులు కూడా ఇంత వరకు అందలేదని, ఇక ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, జనవరి వస్తే మరో డీఏ చెల్లించాల్సి వస్తుందని కార్మికులు అంటున్నారు.