Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరురూరల్
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తీగలు తగిలి మూడు పాడి గేదెలు మృతి చెందిన సంఘటన శనివారం ఆలేరు మండలంలోని గొలనుకొండ గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రైతు బురెడ్డి యాదిరెడ్డి రోజులాగే గేదెలను మోపుతున్నాడు. గేదెలు ట్రాన్స్ఫార్మర్ దగ్గర మోస్తుండగా మూడు గేదెలు తీగలుతగలడంతో విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాయి. వాటి విలువ మూడు లక్షలు ఉంటుందని, ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.
ఆర్థిక సాయం అందించిన ఐలయ్య
మూడు పాడి గేదెలు విద్యుద్ఘాతంతో మృతిచెందగా రైతులు శనివారం కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల ఫౌండేషన్ చైర్మెన్ బీర్ల ఐలయ్య పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు కాండ్రాజు వెంకటేశ్వర రాజు , ఎంపీపీ గందమల్ల అశోక్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు బంధరపు మధు గౌడ్ , గోలనుకొండ గ్రామ శాఖ అధ్యక్షుడు కష్ణమూర్తి , ఎంపీటీసీ బాకి లక్ష్మి రామనర్శయ్య ,శారాజీ పేట గ్రామశాఖ అద్యక్షుడు కంతి నాగరాజు శివశంకర్ ,వేణు గౌడ్, వుట్కురి సురేష్ గౌడ,్ నాగరాజు రెడ్డి ,బీమగాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.