Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడిపాపయ్య
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
రాజకీయ నాయకుల వద్ద మాదిగలు పని చేయడం వల్లనే మాదిగలకు సమాజంలో గౌరవం పోయిందని,అలా కాకుండా కేవలం కులం కోసం పని చేసినప్పుడు మాత్రమే సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందని ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ అన్నారు.శనివారం జిల్లాకేంద్రంలోని జీవీవీ ఫంక్షన్హాల్లో మరికంటి అంబేద్కర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లాస్ధాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.మాదిగ యువకులు ఉద్యోగాలు లేక,ప్రభుత్వ పథకాలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణలో మాదిగలకు పంట పొలాలు లేకపోవడం వలన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధుపథకం మాదిగలకు అందడం లేదన్నారు.అందుకే ప్రభుత్వం ప్రతి మాదిగ కుటుంబానికి మూడెకరాలభూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.దళితబంధు పథకం నిరుపేదలకు ఇవ్వాలని కోరారు.అనంతరం జిల్లా కమిటీని ప్రకటించారు.జిల్లా అధ్యక్షుడిగా పడిదెల రవికుమార్,వర్కింగ్ ప్రెసిడెంట్గా బచ్చలకూరి నాగరాజు, అధికార ప్రతినిధిగా ఠాగూర్, ఉపాధ్యక్షుడుగా ఇరుగుమధు, రాంబాబు, వెంకన్న, ప్రధానకార్యదర్శిగా బచ్చలకూరిశ్రీను, సోమన్న,వెంకటేష్, కందుకూరి నారాయణ, నాగేశ్వరరావు, కోశాధికారిగా వంగాల పరుశరామ్ను ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, మరికంటి అంబేద్కర్, చింతాబాబు, శోభ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.