Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు శిథిలావస్థ భవనాల కూల్చివేత
- ఈద్గా వద్ద బక్రీదు ఏర్పాట్లపై పర్యవేక్షణ
నవతెలంగాణ -నల్గొండ కలెక్టరేట్
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నల్లగొండ పట్టణంలోని పలు లోతట్టు కాలనీలు నీటిలో మునిగిపోయాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకునే ముందస్తు చర్యగా మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణాచారి మున్సిపల్ సిబ్బందితో వర్షంలోనూ శనివారం పట్టణంలోని పలు వార్డులలో పర్యటించారు. నేడు బక్రీద్ పండుగ ఉన్నందున మొదటగా ఈద్గా ను సందర్శించారు. అక్కడ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి బక్రీద్ పండుగ సందర్భంగా సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. గుంతలు ఉన్నచోట మట్టితో నింపాలని అవసరమైన చోట వీధిలైట్ల ఏర్పాటు చేయాలని నీరు నిలువ ఉండకుండా చూడాలని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం అక్కడి నుండి పానగల్ జంక్షన్ కి వెళ్లి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ నీరు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుంతలు కలిగిన ప్రాంతాలలో ప్రమాదపు హెచ్చరిక బోర్డులను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాతబస్తీకి వెళ్లి కూలటానికి సిద్ధంగా ఉన్న మూడు నిర్మాణాలను కూల్చివేశారు. మరికొన్ని నిర్మాణాలు కూడా కూలటానికి సిద్ధంగా ఉన్నాయని ఆక్కడ నివాసం ఉండే ప్రజలు ఆ ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని లేని పక్షంలో వర్షానికి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నదని వారికి తెలిపారు . కులాటానికి సిద్ధంగా ఉన్న నిర్మాణాలు గల యజమానులకు ఈ సందర్భంగా కమిషనర్ రమణాచారి నోటీసులను జారీ చేశారు.