Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ఈ నెల 14న తలపెట్టిన విద్య సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ ఉప్పుల శాంతి కోరారు. భువనగిరి జిల్లా కేంద్రంలో సుందరయ్యభవన్ లో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో విద్యసంస్థలు ప్రారంభమై నేటికీ నెలరోజులు కావస్తున్నా ఖాళీగా ఉన్న టీచర్స్ పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థులకు ఇవ్వాల్సిన పుస్తకాలు ఇవ్వకుండా కొద్ది పుస్తకాలతో విద్యార్థుల కు ఏ విధంగా నాణ్యమైన విద్య అందిస్తారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థులకు పాఠశాల్లో మౌలిక సదుపాయా లకల్పించకుండా విద్యను ఎలా అభ్యసిస్తారని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు, స్కావెంజర్ పోస్టులు భర్తీ చేయాలని, ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ బంద్‌కు విద్యసంస్థల యాజమన్యాలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేహల్,దండి సంతోష్, ఈర్ల కార్తిక్, శ్రీకాంత్, శంకర్ ,వేణు పాల్గొన్నారు.