Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూరుఎస్
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని తుమ్మల పెన్‌పహాడ్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్సై యాదవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..తుమ్మలపెన్‌పహాడ్ గ్రామానికి చెందిన మరకాల మధుసూదన్‌రెడ్డి(53)ఈనెల 6న తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబసభ్యులు సూర్యాపేట జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మధుసూదన్‌రెడ్డి పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం మతి చెందాడు.మతుడు తన కుటుంబంతో కలిసి కొంతకాలంగా వ్యవసాయ భూమి దగ్గర ఉంటుందని బొట్యతండా శివారులోనే ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నాడు.తుమ్మలపెన్‌పహాడ్ గ్రామ శివారు సర్వేనెంబర్ 313లో తన భూమిలో కొంత భాగం అక్రమంగా బొట్యతండాకు చెందిన భూక్యాపూల్సింగ్ ఆక్రమించుకొని కొంతకాలంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు.ఈ విషయంపై రెెవెన్యూ,పోలీసు శాఖ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతోనే మన స్తాపానికి గురయ్యాడని ,తన భర్త మధుసూదన్‌రెడ్డి మతికి భూక్యా పూల్‌సింగ్, అతని భార్య భారతి, తమ్ముడు బాబు కారణమంటూ మృతుని భార్య నాగమణి ఫిర్యాదు చేసింది.మతదేహాన్ని పూల్‌సింగ్ ఇంటి ముందు ఉంచి మతుని బంధువులు ఆందోళనకు దిగారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతికి కారణమైన వారిని చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.దీంతో ఆందో ళనను విరమించారు.అనంతరం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.మతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.