Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రహోమ్ ఎఫైర్స్ విద్యా శాఖ డైరెక్టర్ మార్చంగ్ వర్తింగ్,రూర్కీ ఆర్కియాలజీ సైంటిస్ట్ నీమా
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో జలశక్తి అభియాన్ ద్వారా చేపట్టిన పలు పథకాలు అద్భుతంగా ఉన్నాయని కేంద్ర బంద సభ్యులు, కేంద్ర హోమ్ ఎఫైర్స్ విద్యా శాఖ డైరెక్టర్ శ్రీమార్చంగ్ వర్తింగ్, రూర్కీ ఆర్కియాలజీ సైంటిస్ట్ ఆర్.కె నీమా అన్నారు.శనివారం ముగింపు పర్యటనలో భాగంగా సూర్యాపేట జిల్లాలో జలశక్తిఅభియాన్ కేంద్ర తనిఖీ బందం క్షేత్రపర్యటన అననతరం కలెక్టరేట్లో కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డితో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో తమ పర్యటన అనుభవాలు గుర్తించిన అంశాలను కలెక్టర్‌కు వివరించారు.జిల్లాలో మూడు రోజులుగా ఐదు మండలాలను సందర్శించి జల సంరక్షణ కోసం జిల్లాలో చేపడుతున్న పటిష్టమైన పనులను సమగ్రంగా పరిశీలించారు.జిల్లాలో అంత్యంత పకడ్బందీగా జల సంరక్షణ ప్రణాళిక అమలు జరుగుతున్నట్టు గుర్తించడం జరిగిందన్నారు.దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించినప్పటికీ ఇక్కడ గమనించిన ప్రతిఫలాలు ఇతర రాష్ట్రాలలో గుర్తించలేదని, కేవీకే గడ్డిపల్లి రైతుల కోసం వారి తాపత్రయం, నీటిసంరక్షణ పద్ధతులపై రెగ్యులర్‌గా శిక్షణలు, విద్యార్డులకు క్షేత్రస్థాయి శిక్షణ ప్రాంగణం లో ప్రదర్శిత కేంద్రాలు అబ్బుర పరిచేవిధంగా ఉన్నాయని తెలిపారు.మండలాల్లో అధికారులు సైతం ప్రభుత్వ పథకాల అమలులో అంకితభావంతో పని చేస్తున్నా రన్నారు.ప్రతి గ్రామంలో జాతీయ ఉపాధిహామీ చట్టంలో చేపట్టిన పనులను గమనిస్తే ఆ శాఖ పల్లెల్లో గడప గడపకు అత్యంత చేరువై వారికి ఉపయోగపడే పనులు చేపడుతున్నారన్నారు.పల్లె ప్రగతిలో దేశంలోనే ఆదర్శంగా గ్రామ మౌలిక వసతులన్ని ఏర్పాటు చేసుకున్నారని, గ్రామంలో చెత్తను సేకరించి దానిని ఎరువు చేసుకోవడం, తద్వారా ఊరు శుభ్రం చేసుకోవడానికి పల్లెపల్లెకూ ట్రాక్టర్, ట్యాంకర్ ఇవ్వడంలో దేశంలో ఎక్కడా లేదని తెలిపారు.అలాగే పచ్చదనం మేఘాల ఆకర్షణతో వర్షాలకై జిల్లాలో చేపట్టిన హరితహారం ఎటుచూసినా పచ్చనిమొక్కలు, చెట్లతో పార్కులు, మెగా పార్కులు, క్రీడా ప్రాంగణాలు చివరకు మనిషి కాలం చేస్తే చివరి ప్రయాణం సైతం సుఖవంతంగా చేయడానికి అత్యంత సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఉన్నాయని గుర్తించామన్నారు.చెరువుల పూడికతీత, ఫారం పాండ్ల నిర్మాణం, చెక్‌డామ్‌ల నిర్మాణం, చేపలచెర్వులనిర్మాణం, కాలువల పూడికతీత, ఇంకుడుగుంతల నిర్మాణంతో జిల్లాలో పడిన వర్షపునీటిని నిల్వచేసి అత్యంత పొదుపుగా వాడుకోవడం అద్బుతంగా ఉందని కొనియాడారు. ఉద్యానవన శాఖ సైతం రైతులకు చేయూతనిస్తూ ఉద్యానవనాలను ఏర్పాటు చేసి జల్ సంరక్షణ,పంటమార్పిడితో రైతులకు నిరంతర ఆదాయ మార్గాలను అందిస్తున్నట్టు గుర్తించామన్నారు.నీటి పారుదల శాఖ ద్వారా నిర్మించిన భారీ చెక్‌డామ్‌లు బాగున్నాయన్నారు. జిల్లాలో చెక్‌డ్యామ్‌లు, బిడ్జిల అవసరం ఉన్నచో వాటి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయిస్తామని తెలుపగా కలక్టర్ సానుకూలంగా స్పందించారు.జిల్లాలో రైతులు సంప్రదాయేతర పద్ధతుల్లో వ్యవసాయభూమిలో సాగు చేస్తున్న ఖర్జూర,ఎన్బీకేసీతాఫలం, పందిరి కూరగాయల సాగు, నాటుకోళ్ళ పెంపకంతో వ్యాపారవేత్తలా ఆలోచిస్తూ ఇతరుల కంటే భిన్నంగా తక్కువనీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఎక్కువపంటలు సమగ్ర వ్యవసాయ పద్ధతుల్లో సేంద్రీయ విధానంతో చేస్తున్న ప్రయత్నం అత్యంత ప్రశంసనీయమని తెలిపారు.జిల్లాలో ఉపాధిహామీచట్టంలో చేపట్టిన మెటీరియల్ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగు తుందని కలెక్టర్ కేంద్రబందం దష్టికి తీసుకురాగా ఆ విషయాన్ని కేంద్రస్థాయిలో పరిశీలించడానికి నివేదిస్తామని తెలిపారు.జిల్లా పర్యటనలో సహ కరించిన కలెక్టర్‌కు, టీమ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.నవంబర్ మాసంలో రెండవవిడత జిల్లా సందర్శనకు వస్తామని ఈ సందర్బంగా తెలిపారు.