Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-హాలియా
పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని, 11 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్న గిరిజన ఇతర పేద రైతులకు పట్టాలిస్తామని, 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సీఎం వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.శనివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాకముందు నేనే స్వయంగా మంత్రులు, అధికారులను వెంట తీసుకొని జిల్లాలలో పర్యటించి అక్కడే కూర్చి వేసుకుని పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తానని, వెంటనే పట్టాలిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకొచ్చి 8 ఏండ్లవుతున్నా పోడుభూములకు హక్కులు కల్పించలేదని, పైగా అటవీశాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు చేస్తూ లాఠీచార్జి చేయడం,అక్రమకేసులు పెట్టడం వంటి తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.11 లక్షల ఎకరాల పోడుభూములపై మూడున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఏడు నెలల కింద గ్రామసభల ద్వారా మూడున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. అటవీశాఖ అధికారులు పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి అమాయక పేద గిరిజన రైతులపై కేసులు పెట్టడం, కాళ్లు, చేతులు విరగగొట్టడం,లాఠీచార్జి చేయడం దారుణమన్నారు.హాలియాలో 48 సర్వే నెంబర్లో 20 ఏండ్లుగా నివాసముంటున్న పేదలకు ఇండ్ల పట్టాలివ్వాలని కోరారు.అర్హులైన పేదలందరికీ ఇండ్ల స్థలాలు, డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డబ్బికార్ మల్లేశ్, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, నాయకులు మల్లు గౌతమ్‌రెడ్డి, రవినాయక్, కారంపూడి ధనమ్మ, పొదల వెంకన్న పాల్గొన్నారు.