Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
భువనగిరి రూరల్:ఉపాధ్యాయులందరూ ఉత్తమ విద్యాబోధన చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. జిల్లా పరిపాలన శాఖ, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో టీచర్స్ కాంక్లేవ్ పేరుతో భువనగిరి, బీబీనగర్, బొమ్మలరామారం, ఆలేరు, యాదగిరిగుట్ట ఐదు మండలాలకు సంబంధించిన ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని నివారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. చక్కటి బోధనాభ్యసన అనుభవాలను ఉపాధ్యాయుల ద్వారా సేకరించి ఒక సంకలనం పుస్తకాన్ని తయారు చేయాల్సిందిగాజిల్లా విద్యా శాఖ అధికారిని ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా పరిపాలన అధికారి దీపక్ తివారి మాట్లాడుతూ ఇలాంటి సమావేశాలు మండలం, క్లస్టర్ స్థాయి లో కూడా నిర్వహించాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి కె నారాయణ రెడ్డి, సెక్టోరియల్ అధికారులు ఎన్ ఆండాల్, జె.శ్రీనివాస్, మండల విద్యాధికారులు జె కష్ణ ,బి లక్ష్మినారాయణ, నాగ వర్ధన్ రెడ్డి , రిసోర్స్ పర్సన్ లుగా టి వెంకన్న, శైలజ, జ్యోతిర్మయి, విజయలక్ష్మి, హరికిషన్, శ్రీ లత పాల్గొన్నారు.