Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి యండి. జహంగీర్
నవతెలంగాణ- భువనగిరిరూరల్
కష్టజీవుల హక్కుల కోసం, దోపిడీ రహిత సమాజం కోసం చిన్ననాటి ఎర్రజెండా చేతబట్టి తుది శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన గొప్ప నాయకుడు కొల్లూరి పోచయ్యఅని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. శనివారం భువనగిరి మండల పరిధిలోని నందనం గ్రామంలో అనారోగ్యంతో మతి చెందిన కొల్లూరు పోచయ్య భౌతిక కాయాన్ని ఆ పార్టీ నాయకత్వం సందర్శించి ఎర్రజెండా కప్పి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ పోచయ్య నిరుపేద దళిత కుటుంబంలో పుట్టినా నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో దొరలకు జాగీర్దారులకు, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా సాగిన మహోత్తరమైన వీర తెలంగాణ సాయుధ పోరాటంలో కొరియర్గా పనిచేస్తూ పేదాల పక్షాన నిలబడి పోరాడిన మహా నాయకుడు అని కొనియాడారు. మోటకొండూరు మండలం ఆరెగూడెం గ్రామంలో జన్మించి భువనగిరి మండలం నందనం గ్రామంలో స్థిరపడి కూలి, భూమి, ఇండ్ల స్థలాల పోరాటంలో, దున్నేవాడికి భూమి కావాలని గీసే వాడికి చెట్టు కావాలని జరిగిన అనేక పోరాటాలు పోచయ్య తన వంతు పాత్ర పోషించారని తెలిపారు. అనేక రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చి అనేక ప్రలోభావాలు పెట్టిన ఏనాడు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం సీపీఐ(ఎం) జెండాను వదలలేదన్నారు. నిరంతరం ప్రజల సమస్యలే తమ ఎజెండగా పనిచేసిన నాయకుడిని, మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడిగా తన జీవితాన్ని కొనసాగించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడని పేర్కొన్నారు. పోచయ్య ఆశయ సాధనలో ప్రజలు, ఎర్రజెండా కార్యకర్తలు కషి చేయాలని వారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజ్, భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, డీివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ముత్యాలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, నందనము ఎంపీటీసీ మట్టా పారిజాత శంకర్ బాబు,నమాత్ పల్లి గ్రామ సర్పంచ్ ఎల్లంల షాలిని జంగయ్య, సిపిఎం మండల మాజీ కార్యదర్శి బొల్లెపల్లి కుమార్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం, కొండా అశోక్, మండల కమిటీ సభ్యులు గునుగుంట్ల శ్రీనివాస్, ఎల్లముల వెంకటేష్, కొండాపురం యాదగిరి,అనాజిపురం పాలసంఘం చైర్మెన్్ గంగనబొయిన పాండు, నాయకులు కూకుట్ల కష్ణ, సురుపంగ ప్రకాష్, కొండాపురం పౌలు, కొండాపురం ఆంధ్రయ్య, సింగిరెడ్డి పెంటారెడ్డి, కొలన్ రవీందర్ రెడ్డి, కొల్లూరి బిక్షపతి, కొల్లూరి ఆంజనేయులు పాల్గొన్నారు.