Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆచార్య డాక్టర్ కూరెళ్ళ ది అక్షర తపస్సు
- మహిళలు సాహిత్య, సాంస్కతిక రంగాల్లో రాణించాలి
- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -రామన్నపేట
రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో దాశరధి పురస్కార గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త, మధురకవి ఆచార్య డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య గ్రామంలో స్థాపించిన గ్రంథాలయాన్ని సందర్శించడం ఎంతో సంతప్తినిచ్చిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం మండలంలోని వెల్లంకి గ్రామంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటి అనంతరం గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామ రైతు వేదికలో నిర్వహించిన గర్భిణులకు శ్రీమంతం, చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మహిళాభారతి సాహిత్య, సాంస్కతిక సేవ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య జన్మదినం వేడుకల్లో పాల్గొని ఆయన ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మారుమూల గ్రామంలో మహిళల కోసమే ఒక ప్రత్యేక సాహిత్య, సాంస్కతిక సేవా సంస్థ ఏర్పాటు చేయడం, మహిళలు చక్కగా కవితలు రాయడం తోపాటు ప్రత్యేకంగా పుస్తకాన్ని అచ్చు వేయడం అభినందనీయమన్నారు. గ్రామంలో సొంత ఇంటిని గ్రంథాలయంగా మార్చి రెండులక్షలకు పైగా విలువైన పుస్తకాలను సేకరించి ఏర్పాటు చేయడం గ్రామీణ ప్రజల విద్యార్థుల అదష్టమని, ఈ గ్రంథాలయాన్ని సద్విని చేసుకోవాలనిసూచించారు. దేశ ప్రధానమంత్రి తో ప్రశంసించబడిన డాక్టర్ కూరెళ్ళ మన జిల్లాకే గర్వకారణమని తెలిపారు. ప్రతి బుధవారం డాక్టర్ కూరెళ్ళ గ్రంథాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని గ్రామ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి లను శాలువా కప్పి జ్ఞాపకతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీిఆర్ఓ నాగిరెడ్డి, ఎంపీడీఓ జలంధర్ రెడ్డి, తహసిల్దార్ వలిగొండ ఆంజనేయులు, ఉప సర్పంచ్ రవ్వ అనసూర్య, సీడీపీఓ శైలజ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి పి. సైదులు, తదితరులు పాల్గొన్నారు.
బాలల భవిష్యత్ ముఖ్యం
బాలల భవిష్యత్తు ఎంతో ముఖ్యమైనదని దానికోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ పమేలాసత్పత్తి అన్నారు. శనివారం మండలంలోని వెల్లంకి గ్రామంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి పాల్గొని గ్రామంలో పిల్లల అంశాలకు సంబంధించి పనిచేసే శాఖలైన విద్యా శాఖ, ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయితీ రాజ్ శాఖ, రెవిన్యూ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలలో బాల్యవివాహలు, బాలకార్మికులు, బాలల అక్రమారవాణా తదితర సమస్యల పట్ల ప్రతి ఒక్కరూ స్పందించాలని తెలిపారు. ప్రతినెలా బాలల సమస్యలపై సర్పంచ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించి ఎప్పటికప్పుడు బాలల హక్కుల పరిరక్షణ కు కషి చేయాలని తెలిపారు.