Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సిలిండర్లతో నిరసన
నవతెలంగాణ -నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆ పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుభాష్ విగ్రహం వద్ద గ్యాస్ సిలిండర్ మీద కట్టెలు పెట్టి వంట చేస్తూ ప్లే కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉజ్వల పథకం పేరుతో ఉచిత గ్యాస్ ప్రజలకు విరివిగా 9కోట్ల కనెక్షన్లు ఇచ్చినా 90లక్షల మంది తిరిగి గ్యాస్ ను తీసుకోలేదన్నారు. 1.08కోట్ల మంది మాత్రమే మరోసారి తీసుకున్నారని ఇటీవల ప్రభుత్వ సంస్థలు సమాచారం ఇచ్చాయన్నారు. ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రజలు ఉపాధి కోల్పోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో గ్యాస్ ధరలు ప్రజలకు గుదిబండగా మారాయని పేర్కొన్నారు . గ్యాస్ కొనలేక మహిళలు కట్టెల పొయ్యి శరణ్యమని గ్యాస్ పక్కకు వేసే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పొయ్యిమీద వాడకం అంటూ మళ్లీ వస్తే పొగతో మహిళలు అనారోగ్యానికి గురవుతారు గ్యాస్ కి 1150 రూపాయలు చెల్లించాల్సి వస్తే కుటుంబ పోషణ భారంగా మారుతుందని ప్రభుత్వం వెంటనే పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయడంతో రోజు ధరలు పెరుగుతున్నాయని అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజా, కార్మిక ,రైతు ,మహిళా వ్యతిరేక విధానాలను మానుకోవాలని హెచ్చరించారు. . కరోనా కారణంగా ప్రజలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉపాధి లేక తినడానికి సరిగా తిండి లేక అర్ధాకలితో అలమటిస్తున్నార అని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ చేయలేక దానికి తోడు పెరుగుతున్న గ్యాస్ ధరలు ఆర్థిక భారంతో సంసారాలు ఈదలేక సతమతమవుతున్న ప్రజల ను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉండడానికి సొంత ఇండ్లు లేక అద్దె ఇంటికి కిరాయిలు కట్టలేక సతమతం అవుతున్నారని ఈ సమయంలో గ్యాస్ ధరలు పెంచడం దారుణమని పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాశమ్, బండా శ్రీశైలం, చినపాక లక్ష్మీనారాయణ, పట్టణ కార్యదర్శి ఎండి.సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కుంభం కష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, పట్టణ కమిటీ సభ్యులు గాదె నరసింహ, ఊటుకూరు మధుసూదన్ రెడ్డి, మారగోని నగేష్ ,గుండాల నరేష్, గనిపల్లి రాములు, కునుకుంట్ల ఉమారాణి, కందుల అశోక్, షేక్ లతీఫ్ ,నకరేకంటి సుందరయ్య, లక్ష్మమ్మ, శివమ్మ, ప్రసన్న, రవీందర్ రెడ్డి, పల్లె నగేష్ , సుల్తాన్ ,వెంకన్న, గడ్డం రాములు, వెంకటయ్య, విష్ణుమూర్తి జానకి రాములు, పాల్గొన్నారు.