Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -బీబీనగర్
ఎల్డీఎస్ చారిటీ బందం వారిచే త్వరలో మండల వ్యాప్తంగా నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని రాయరావుపేట గ్రామంలో గతంలో ఎల్డిఎస్ చారిటీ బందం సహకారంతో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని బందం సభ్యులతో పరిశీలించారు. సందర్భంగా ఎంపీపీ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ నీటి శుద్ధి కేంద్రాలు లేని గ్రామాల్లో చారిటీ సహకారంతో త్వరలో ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎస్ చారిటీ అమెరికన్ సభ్యులు ఎల్డర్, అండ్ సిస్టర్ జెర్లాక్, హైదరాబాద్ ప్రతినిధి శేఖర్, ఎంపీడీవో శ్రీవాణి, స్థానిక సర్పంచ్ రమేష్, వైసిపి వాకిటి గణేష్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.