Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్
నవతెలంగాణ-చౌటుప్పల్
విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ప్రయివేట్ పాఠశాలల విద్యార్థుల నుండి ఫీజుల దోపిడీకి పాల్పడుతున్న పాఠశాలల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు డిమాండ్‌చేశారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో పట్నం కన్వీనర్ గుణమోని అయిలయ్య అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అనేక ప్రయివేట్ పాఠశాలల్లో పేద, మధ్యతరగతి ప్రజల నుండి ఫీజులు, పాఠ్య పుస్తకాలు, రవాణా చార్జీల పేరుతో వేల రూపాయలు వసూలుచేస్తూ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను మనుగడలోకి తీసుకురాకపోవడం వల్ల ప్రయివేట్ పాఠశాలలను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. విద్యాహక్కు చట్టాన్ని నీరుగార్చే విధంగా ప్రయివేట్ పాఠశాలలు విద్యనందిస్తున్నాయన్నారు. విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టానుసారంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు అమ్మకం చేస్తున్నారని తెలిపారు. ఫీజుల దోపిడీ చేస్తున్న ప్రయివేట్ పాఠశాలలపై రానున్న కాలంలో ఉధత పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా సహాయకార్యదర్శి ఎమ్‌డి.ఖయ్యుమ్, బిక్షపతి, కృష్ణ, అంజయ్య, దాసు, అశోక్, సాలయ్య, ఊషయ్య, నర్సింహా పాల్గొన్నారు.