Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పని భారాన్ని తగ్గించాలి
- అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి
నవ తెలంగాణ -భువనగిరి రూరల్
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలని, 45వ ఐఎల్సీ సిఫారసుల ప్రకారం కనీస వేతనం పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలి కార్మికులుగా గుర్తించాలని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఆలిండియా డిమాండ్స్ డేను సందర్భంగా సోమవారం యాదాద్రిభువనగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ ఐసీడీఎస్ను ప్రయివేటీకరణ చేయొద్దన్నారు. నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని రద్దు చేయాలని, 2018 అక్టోబర్ లో కేంద్రం పెంచిన వేతనం టీచర్లకు 1500 ,హెల్పర్లకు 750, మినీ వర్కర్లకు 1250 రాష్ట్ర ప్రభుత్వం ఏరియన్స్తో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. 2017 నుండి టీఏ,డీఏ బకాయిలు మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రేడ్ 2 సూపర్వైజర్ నియామకాలను వెంటనే చేపట్టాలన్నారు. పీఆర్సీ ఏరియర్స్ 2021 జులై, అక్టోబర్, నవంబర్, మూడు నెలలవి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. హెల్త్ కార్డు ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ యాప్స్ సర్వేలు తగ్గించాలన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం గ్రామ సభలు నిర్వహించడం వల్ల ఫ్రీ స్కూల్ లకు ఇబ్బందికలుగుతుందన్నారు. వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన గుడ్లు, ఫుడ్, పాలు కార్గో బస్సుల ద్వారా ఆఫీస్ పనివేళల్లో సెంటర్ వద్దకే సప్లై చేయాలని కోరారు. అనంతరంకలెక్టర్ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బూరుగు స్వప్న, చిలువేరు రమాకుమారి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం, మామిడి వెంకట్ రెడ్డి, నాయకులు మంచాల మధు, రమ, పద్మ, అరుణ, సఫియా, జయప్రద, సుజాత, మంజుల, మాధవి, రుక్మిణి, జంగమ్మ, వసంత, శోభ, సత్యలక్ష్మి, రాధిక, సరిత, రజని, భాగ్యలక్ష్మి, సునిత, లక్ష్మి, సంతోషి, పుష్ప, సరిత, బాల పాల్గొన్నారు.