Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండరూరల్
ప్రజల కోసం తన చివరి శ్వాస వరకు ఎర్రజెండా నాయకత్వంలో పనిచేసిన పొద్దుటూర్ మాజీ ఏకగ్రీవ సర్పంచ్ భూమి మల్లయ్య ఆశయసాధనకు కృషి చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి కోరారు. సోమవారం మండలంలోని పొద్దుటూరు గ్రామంలో భూమి మల్లయ్య 6వ వర్థంతి సందర్భంగా ఆయన స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందాల రంగారెడ్డి వారసత్వంతో ప్రజా పోరాటాల్లోకి వచ్చిన భూమి మల్లయ్య చివరిదాకా కమ్యూనిస్టుగా నీతి నిజాయితీగా సీపీఐ(ఎం) నాయకులుగా, గ్రామ ఏకగ్రీవ సర్పంచ్ గా పని చేశారన్నారని తెలిపారు. ఆ పార్టీ శాఖ కార్యదర్శి దుబ్బ లింగం అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో శాఖ సహాయ కార్యదర్శి పెద్దబోయిన నర్సింహా, మాజీ ఉపసర్పంచ్ పలుసం లింగం,మాజీ ఎంపిటిసి భూమి మాధవి,ప గ్రామ పంచాయితీ వార్డు మెంబర్ పెద్దబోయిన భీమరాజు,నాయకులు అరూరి స్వామి,తళ్ల రవి,కొయ్యడ నర్సింహ,భూమి లోకేష్,బసాని విక్రమ్,మరిపల్లి అనిల్,పాల్గొన్నారు.