Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
ప్లాస్టిక్ కవర్లను ఎవరైనా ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఇన్ఛార్జీ కమిషనర్ విశ్వేశ్వరరావు తెలిపారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలోని వర్తక, వ్యాపార షాపులలో ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా ఐదు షాపుల్లో ప్లాస్టిక్ కవర్లు దొరికినందున షాపుల యజమానులకు రూ.4600 పెనాల్టీ విధించినట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు వెంకటేశ్వర్లు, హనుమాన్ ప్రసాద్, బిల్ కలెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.