Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ కోటాచలం
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రతి అర్హులైన దంపతులకు కుటుంబనియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ కోటాచలం సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రిన్సిపాల్ డాక్టర్ శారదా ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో వైద్య విద్యార్థులు, డాక్టర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లా జనాభా 11,85,230లుగా అంచనా వేశామన్నారు.జిల్లా జననాల రేటు1000 జనాభాకు 16.9 ఉన్నదని తెలిపారు.మరణాల రేటు 6.3గా ఉన్నదన్నారు.ప్రతి సంవత్సరం 1000 జానాభాకు అదనంగా 10 మంది జమమవుతున్నారు.దీంతో ఎన్ని ప్రణాళికలు చేసినా జనాభాతో అనేక ఆర్థిక, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.కుటుంబ నియంత్రణపై ప్రజలను అవగాహనా కార్యక్రమాల ద్వారా చైతన్యపరిచి జనాభా స్థిరీకరణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.అభివద్ధి చెందిన దేశాలలో జనాభా పెరుగుదల రేటు చాలా తగ్గిపోయి, దాదాపు నిలకడగా స్థిరంగా ఉన్నదన్నారు.సగటు ఆయు ప్రమాణము గణనీయంగా పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా వృద్ధుల జనాభా ఆయా దేశాలకు శాపంగా మారిందన్నారు.ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి, స్త్రీల విభాగ అధిపతి డా.ఆధి సుజాత జనాభా పెరుగుదల నియంత్రణపై వివరించారు.జిల్లాలో కుటుంబసంక్షేమం కోసం పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు.ఉత్తమ సర్జన్ డా.కె.మమత, ఉత్తమ స్టాఫ్ నర్స్ సునీత, ఉత్తమ సూపర్వైజరు రంగమ్మ, ఉత్తమ మహిళా ఆరోగ్య కార్యకర్త ఆర్.మాధవి, ఉత్తమ ఆశా కార్యకర్త శోభారాణిలను జ్ఞాపిక, ప్రశంశాపత్రంతో సత్కరించారు.జనాభా పెరుగుదలకు ప్రధానకారణాలైన బాల్యవివాహాలు,పెండ్లి జరిగిన వెంటనే పిల్లలు కనడం, కాన్పుకుకాన్పుకు మధ్య ఎడం లేకపోవడం, మగ పిల్లలకోసం ఎదురుచూడడం వల్ల జనాభా పెరుగుదల ఉంటుందన్నారు.దీనిని గమనించి ప్రజలు కుటుంబనియంత్రణ పద్ధతుల గురించి తెలుసుకుని పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు, డా.వెంకటరమణ, డా శ్రీనివాసరాజు, ఎస్ఓ వీరయ్య, డెమో అంజయ్యగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.