Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
ఈనెల 16న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగే సంచార జాతుల మహాధర్నాను విజయవంతం చేయాలని సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షులు ఒంటెద్దు నరేందర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాకేంద్రంలోని తిరుమల గ్రాండ్ హోటల్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి సంచార జాతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదన్నారు.విద్యా ,ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, ఉపాధి రంగాలలో సంచారజాతులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది సంచార జాతి ప్రజలు ఉంటే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి నేటి వరకు కూడా వారి బతుకులు మారలేదన్నారు.ఈ అనంతరం కరపత్రాన్ని విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పెర్రకష్ణ, వెన్నెల నాగరాజు, యువరాజు, జెల్లి సత్యనారాయణ, పన్నీరు నాగేశ్వరరావు, జెల్లి గణేష్, సమ్మయ్య, కుక్కట్లశంకర్, రాము, కృష్ణ, శివ పాల్గొన్నారు.