Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
విద్యార్థులకు చిన్నతనం నుంచే ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలని మండల వైద్యాధికారి నాగునాయక్, హెచ్ఈఓ సముద్రాల సూరి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలల్లో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక దష్టి పెట్టాలని సూచించారు. సమయానికి భోజనం, ఉదయం వేళ యోగా, పలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి అన్నారు.సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు గాజుల సోమన్న, నర్సింహాచారి, యాదగిరి, నవీన్, నాగరాజు,ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు దుర్గాభవాని,శ్యామలత, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వైస్‌ప్రిన్సిపాల్ షేక్ హసీనాభేగం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినులు పాల్గొన్నారు.