Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మోటకొండూర్
ఫిట్నెస్ జిఓ నెంబర్. 714ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. ఇమ్రాన్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో రైతు మిత్ర ట్రాలీ ఆటో డ్రైవర్స్ యూనియన్ సమావేశంలో వారు మాట్లాడుతూ రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు గనబోయిన వెంకటేష్, సిపిఐ మండల కార్యదర్శి గాదెగాని మాణిక్యం, ఏఐటీయూసీ మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్, నాయకులు బీరకాయల మల్లేష్, ట్రాలీ ఆటో యూనియన్ అధ్యక్షులు రేగు నరసింహ, ఉపాధ్యక్షులు జీబిలికలపల్లి రాములు, పాల్గొన్నారు.