Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరు టౌన్
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ఆర్అండ్బీ అధికారులతో మంగళవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇటీవల కురుస్తోన్న వర్షాల వలన రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని ప్రయాణించడానికి కష్టంగా ఉందని చెప్పారు. మంజూరైన వివిధ రోడ్లను వెంటనే ఇన్ టైమ్‌లో పనులు పూర్తయ్యేటట్లు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 33.75 కోట్లతో తుర్కపల్లి నుండి యాదగిరిగుట్ట వరకు వయా అమలాపురం వెంకటాపురం డబుల్‌రోడ్డు పూర్తి చేయలేదని ,10.30కోట్ల రూపాయలతో ఆలేరు మండలంలోని కొలనుపాక రాజాపేట నమిలే చౌరస్తా వరకు , రూ.89.50 లక్షలతో ఆలేరు మండల కేంద్రం జాతీయ రహదారి నుండి మంతపురి, మాటూరు వరకు వయా ఇక్కుర్తి, శర్బనాపురంలో బీటీ రెన్యువల్ పనులు ప్రారంభించకపోవడం పై అధికారులతో సీరియస్ గా చర్చించారు. రూ.8కోట్ల లక్షలతో యాదగిరి గుట్ట నుండి సింగారం వరకు వయా సైదాపురం, మాసాయిపేట, గౌరయపల్లి, బసంతాపురం ,కాల్వపల్లి, రాజాపేట, పాముకుంట, మొత్తం29 కిలోమీటర్లు ,500 మీటర్ల రోడ్డు మంజూరై రెండు సంవత్సరాలు గడుస్తున్నా కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించకపోవడంతో మీ నిర్లక్ష్యం కనబడుతుందని అధికారులతో ఆవేదన వ్యక్తం చేశారు . 1కోటి 20 లక్షల తో ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో నుండి2 కోట్ల 50 లక్షల రూపాయలతో రాజాపేట మండలం సోమారం వరకు వయా లక్ష్మక్కపల్లి బీటీరోడ్ రెన్యూవల్ ఇంకా ప్రారంభించలేదన్నారు . 6 కోట్ల 50లక్షలతో ఆలేరు పట్టణంలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు డివైడర్ లో ఇల్లు కోల్పోయిన లబ్దిదారులకు డబ్బులు వారంలో జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేస్తున్నట్టు తెలిపారు. కోటి 12 లక్షలతో గుండాల నుండి గంగాపురం వరకు, 2 కోట్ల 25 లక్షలతో రాజాపేట మండలం సోమారం నుండి బేగంపేట వయా బొందుగుల ,రాజంపేట,రేణిగుంట 3.35 లక్షలతో ఆలేరు మండలం కేంద్రం జాతీయ రహదారి నుండి తూర్పుగూడెం వరకు రెండు కిలోమీటర్ల రోడ్డు కోటి 25 లక్షలతో భువనగిరి, జగదేవ్ పూర్ నుండి వయా గోవుల గుట్ట కాకుండా గొల్లగూడెం ధర్మారం మాదాపురం వరకు ,5.60 లక్ష్యాలతో ఆలేరు మండల కేంద్రం నుండి బహదూర్‌పేట వరకు,7.50 లక్షలతో బొమ్మలరామారం మండలం కాజీపేట గ్రామం నుండి యావపూర్ తాండా వరకు రోడ్డు పనులు ప్రారంభం కావాల్సి ఉందన్నారు ఆలేరు నియోజకవర్గంలో పది కోట్లు బిటి రెన్యువల్ పనులు మంజూరు అయి రెండు సంవత్సరాలు అయినప్పటికీ పనులు ప్రారంభించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆర్అండ్బీ అధికారులను మందలించారు. ఆరెంజ్ వేయించే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శంకరయ్య. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బిల్యా నాయక్‌ను పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆలేరు మండల కేంద్రంలో 64 డబులుబెడ్రూం ఇండ్లు .,మండలంలోని కొలనుపాక గ్రామంలో 64 గహలు, ఆత్మకూరు మండల కేంద్రంలో హెడ్ క్వార్టర్ లో 52 ఇండ్లు, ఆత్మకూరు మండలం ఉప్పలపాడు గ్రామంలో 45 ఇండ్లు, తుర్కపల్లి మండల హెడ్ క్వార్టర్లు 40 , యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో 40 ,యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో 40 ఇండ్లు, గ్రామాలలో పూర్తి అయిన ఇండ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి ఆగస్టులో లబ్ధిదారులకు అందజేయనున్నట్టు తెలిపారు.