Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్, ప్రయివేట్ స్కూళ్లలో ఫీజులు తగ్గించాలి
- రౌండ్‌టేబుల్ సమావేశంలో వ్యక్తలు
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఫీజు నియంత్ర చట్టం తేవడంతో పాటు విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని, కార్పొరేట్, ప్రయివేట్ స్కూళ్లలో ఫీజులు తగ్గించాలని పట్నం రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, ఎంసీపీఐ జిల్లా ప్రధానకార్యదర్శి వస్కుల మట్టయ్య, సీపీఐ జిల్లా నాయకులు బంటు వెంకటేశ్వర్లు, టీఎస్‌యూటీఫ్ రాష్ట్ర నాయకురాలు నాగమణి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఆరిఫ్, సిద్ధునాయక్ లు డిమాండ్ చేశారు.పట్నం, ఎస్ఎఫ్ఐ, డీివైఎఫ్‌ఐ, ఐద్వా, టీపీఏ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రయివేటీకరణను ప్రోత్సహించడం వలన విద్యా వ్యాపారంగా మారిందని విమర్శించారు.పిల్లలకు నాణ్యమైన గుణాత్మక విద్య అందించాల్సిన ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యం వాటి పేరుతో రూ.వేలు ఫీజులు వసూలు చేస్తున్నాయని విమర్శించారు.నర్సరీ నుంచి మొదలుకొని పదో తరగతి వరకు వేలాది రూపాయలు ఫీజులు వాళ్లే నిర్ణయించి వసూలు చేయడం సరికాదన్నారు.ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు ఈ విషయంపై పట్టించుకోకపోవడం దారుణమన్నారు.విద్యాహక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకోరావాలని డిమాండ్ చేశారు.ఒకే పేరుతో వందలాది బ్రాంచీలు పెడుతూ విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల అనుమతులు రద్దు చేయాలన్నారు.25 శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలన్నారు.ఇరుకైన గదుల్లో సేఫ్టీ లేని విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వీటి అమలు కోసం రాష్ట్రవ్యాప్త ఆందోళన చేయాలని నిర్ణయించారు.ఈనెల 13న మండల కేంద్రాల్లో ఎంఈఓలను ు కలిసి వినతిపత్రాలు అందజే యాలని,15న హైదరాబాదులో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆయా సంఘాల నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, యూటీఫ్ రాష్ట్ర నాయకులు బక్క శ్రీనివాస్‌చారి, రవినాయక్, పరుశరాములు, టి.రామ్మూర్తి, ఎండి అంజద్, డా. మునీర్, నాగేందర్, రాగిరెడ్డి మంగారెడ్డి, వజ్రగిరి అంజయ్య, దేశీరాంనాయక్, రాంచంద్రు,లింగానాయక్, ఎండి సయీద్, పరంగి రాములు, బాబునాయిక్, పాల్వాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.