Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
మండలంలోని అన్ని తండాలలో గిరిజనుల తొలి పండుగ సీత్లాపండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు.గిరిజన దేవతలకు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించు కున్నారు.ఆటా పాటలతో గిరిజన సంప్రదాయ నత్యాలతో సందడి చేస్తారు. ఈ కార్యక్రమాల్లో గిరిజన ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్ : సంస్కతి సంప్ర దాయాలకు ప్రతీకగా సీత్లా అమ్మ వారి పండుగ అని ఎంపీపీ చింతా కవితరాధారెడ్డి అన్నారు. మండలపరిధిలోని భీక్యాతండా గ్రామంలో సీత్లాపండుగ నిర్వహించగా ఆమె ప్రత్యేకపూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ భానోతు అంబేద్కర్,ఎస్టీ సెల్ మండల ప్రధానకార్యదర్శి గుగులోతు మోహన్, లక్ష్మీ, మండల యూత్ అధ్యక్షులు అన్నెం వెంకట్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు చంధ్యా,భూక్యా బాలు, సిఫాయి పాల్గొన్నారు.
తుంగతుర్తి: మండలపరిధిలోని వివిధతండాలలో సీత్లాభవాని పండుగను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో మండలపరిధిలోని మంచ్యతండా సర్పంచ్ లకావత్మాన్సింగ్, దేవునిగుట్టతండా సర్పంచ్ గుగులోత్ ఈరోజి,ఆయా గ్రామాల యువతులు,మహిళలు పాల్గొన్నారు.
చింతలపాలెం:మండలవ్యాప్తంగా గిరి జనులు సీత్లాపండుగను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గాంధీనగర తండా సర్పంచ్ అరుణశ్రీనునాయక్, కొత్తగూడెం సర్పంచ్ భూక్యాలక్యారామ్, ఎర్రకుంట తండా సర్పంచ్ బుజ్జి హుస్సేన్‌నాయక్, ఉపసర్పంచ్ కష్ణ, సేవాలాల్ బంజారాసంఘం సూర్యాపేట జిల్లా యూత్ అధ్యక్షుడు రవినాయక్, బాలాజీనాయక్, సోమ్లానాయక్, తండా పూజారి మధునాయక్, రాములునాయక్ పాల్గొన్నారు.